తెలంగాణాలో జిల్లాలభారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ 2025
Telangana Outsourcing Jobs 2025
తెలంగాణాలోని నిజామాబాద్, నల్గొండ జిల్లాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్జులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగాల ప్రకటనలు జారీ చేశారు. BSC నర్సింగ్, MSC నర్సింగ్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 2nd జనవరి 2025 ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ 10th జనవరి 2025
అప్లికేషన్ ఫీజు :
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు :
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹29,900/- శాలరీ ఉంటుంది ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణాలోని నిజామాబాద్, నల్గొండ జిల్లాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్జులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగాల ప్రకటనలు జారీ చేశారు. BSC నర్సింగ్, MSC నర్సింగ్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది పట్టికలో తెలిపిన వయో పరిమితి ఉండాలి
UR / OC అభ్యర్థులకు | 18 – 46 |
SC, ST, OBC, EWS అభ్యర్థులకు | 18 – 51 |
PWD అభ్యర్థులకి | 10,13, 15 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. |
ఎంపిక చేసే విధానం:
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.
ఉండవలసిన డాక్యుమెంట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ తో పాటు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
SSC / డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఉండాలి
ఇంటర్మీడియట్ / 10+2 అర్హత సర్టిఫికెట్స్
BSC నర్సింగ్ / MSC నర్సింగ్ చేసిన అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
డిగ్రీ అర్హతల అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోస్
తెలంగాణా కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్
SC, ST, OBC, EWS కుల ధ్రువీకరణ పత్రాలు
1st నుండి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్
ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
తెలంగాణాలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.