Tech news

మీకు తెలుసా పేటీఎం అందరికీ క్యాష్ బ్యాక్ ఎందుకు ఇస్తుందో

మీకు తెలుసా పేటీఎం అందరికీ క్యాష్ బ్యాక్ ఎందుకు ఇస్తుందో

డిజిటల్ చెల్లింపుల వేదిక Paytm తన వినియోగదారుల కోసం క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ తన వినియోగదారులకు 2,100 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌గా అందించడం ప్రారంభిస్తుంది. చాలా రకాల ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ చెల్లింపుల కోసం Paytm ను ఉపయోగించడానికి ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యంగా ఉంది.అయితే ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కొన్ని షరతులతో వస్తుంది. ఈ ఆఫర్‌కు అర్హత సాధించడానికి Paytm వినియోగదారులు పాటించవలసిన కొన్ని షరతులు ఏవో తెలుసుకోవడానికి కింద చదవండి.

Paytm క్యాష్‌బ్యాక్ వివరాలు
ప్రకటనలో భాగంగా Paytm తన వినియోగదారులు Paytm ఉపయోగించి QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. Paytm ద్వారా తయారు చేసిన వాటితో వినియోగదారులు ఎలాంటి QR కోడ్‌నైన స్కాన్ చేయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఇతర యుపిఐ ఆధారిత యాప్ సహాయంతో సృష్టించబడిన QR కోడ్‌లకు కూడా పేటిఎం అనుమతి ఇస్తుంది. QR కోడ్ ఆధారిత స్కానింగ్ మరియు అంతర్నిర్మిత QR కోడ్ స్కానర్ ద్వారా వినియోగదారులు పేమెంట్ సులభతరం మరియు త్వరగా చేయవచ్చు. Paytm వినియోగదారులు చెల్లింపు వివరాలను మాన్యువల్‌గా నమోదు చేయనవసరం లేదని నిర్ధారించడం ద్వారా ఇది విషయాల వేగాన్ని పెంచుతుంది. వినియోగదారులు చెల్లింపు కోసం సంబంధిత QR కోడ్‌ను స్కాన్ చేసిన తరువాత యాప్ స్వయంచాలకంగా వివరాలను నమోదు చేస్తుంది.

QR కోడ్
ప్రోగ్రామ్‌లో భాగంగా వినియోగదారులకు వాలెట్ KYC అవసరం లేదని Paytm స్పష్టం చేసింది. బదులుగా వినియోగదారులు QR కోడ్ ఆధారిత చెల్లింపులు చేయడానికి యుపిఐ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించవచ్చు. QR కోడ్‌లతో చెల్లింపులు చేయడానికి Paytm వినియోగదారులు యాప్ ను ఎప్పుడైన లేదా ఎక్కడైన ఉపయోగించవచ్చనే దానిపై పరిమితులు లేవు. నివేదిక ప్రకారం వినియోగదారులు షాపింగ్ మాల్స్, హోటల్స్ , అపార్ట్మెంట్ సర్వీస్, పాఠశాల ఫీజులు లేదా సెలూన్లలో చెల్లింపులు చేయడానికి Paytm యాప్ ఉపయోగించవచ్చు.క్యాష్‌బ్యాక్ మొత్తంప్రతి QR కోడ్ ఆధారిత లావాదేవీపై క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ అనేది ఎంత మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాము మరియు అల్గోరిథం మీద ఆధారపడి ఉంటుంది. Paytm తన వినియోగదారులను మొబైల్ నంబర్ల సహాయంతో డబ్బు పంపించడానికి కూడా అనుమతిస్తుంది. అయితే ఈ చెల్లింపు విధానం ద్వారా Paytm వినియోగదారులకు ఎటువంటి క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని అందించదు. క్యాష్‌బ్యాక్ విధంగా వచ్చిన డబ్బును వారి బ్యాంక్ ఖాతాకు కాకుండా బదులుగా వారి Paytm వాలెట్‌కు పంపబడుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button