EducationNational & InternationalTop News

భారీగా బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలు || 12075 పోస్టులతో నోటిఫికేషన్ జారీ

దేశవ్యాప్తంగా ఉన్న పలు జాతీయ బ్యాంకుల్లో 12వేలకు పైగా కొలువుల భర్తీకి ప్రకటన విడుదలైంది. భారీ సంఖ్యలో పోస్టులు ఉండటం నిరుద్యోగులపాలిట వరం. అయితే లక్షలాదిమంది పోటీపడే ఈ పరీక్షలో నెగ్గాలంటే పక్కా ప్రణాళికతో చదవడం, రివిజన్, ప్రాక్టీస్ తప్పనిసరి. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టు పరీక్ష విధానం, ఎలా ప్రిపేర్ కావాలి, ఏయే పుస్తకాలు చదవాలి అనే అంశాలు నిపుణ పాఠకుల కోసం…bank-clerk
12075 పోస్టులతో నోటిఫికేషన్
-క్లర్క్ పోస్టులు: దేశవ్యాప్తంగా ఉన్న పలు జాతీయ బ్యాంకుల్లో 12075 క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ (ఇండియన్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్) సెప్టెంబర్ 12న ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో 612, ఆంధ్రప్రదేశ్‌లో 777 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు రెండున్నర నెలల సమయం అందుబాటులో ఉన్నది. పక్కా ప్రణాళిక ప్రకారం సిద్ధమయితే, తేలికగా బ్యాంకు ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. -ప్రతి సెక్షన్‌లోనూ కటాఫ్ మార్కులను విడివిడిగా అభ్యర్థులు సాధించాల్సి ఉంటుంది. మొత్తం 60 నిమిషాల్లో ఉండే ప్రిలిమ్స్ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. అయితే విభాగాల వారీగా సమయాన్ని కేటాయించారు. ఈ కోణంలోనే అభ్యర్థులు సిద్ధం కావాలి.bank-clerk3
ప్రిపరేషన్ విధానం
న్యూమరికల్ ఎబిలిటీ -ప్రిపరేషన్ సింప్లిఫికేషన్‌తో ప్రారంభించాలి. BODMAS ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. నిత్యం 100 ప్రశ్నలను సాధించేందుకు యత్నించాలి. ఇవి కేవలం సూక్ష్మీకరణలు. వీటికి ఎలాంటి ప్రాథమిక అంశాలు అవసరం లేదు. వర్గాలు, వర్గమూలాలు నేర్చుకోవాలి. 50 వరకు సంఖ్యల వర్గాలను గుర్తు పెట్టుకుంటే మంచిది. వేగం అనేది, కేవలం ప్రాక్టీస్ వల్లే వస్తుంది. సాధ్యమయినన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా వేగం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 100కు తగ్గకుండా నిత్యం బోడ్మాస్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయడం ద్వారా వేగంగా సూక్ష్మీకరణలు చేయడం వస్తుంది. ఇది అర్థమెటిక్‌కు కూడా ఉపయోగపడుతుంది. అలాగే న్యూమరికల్ ఎబిలిటీలో భాగంగా శాతాలు, లాభనష్టాలు, సరళ, చక్రవడ్డీలు, నిష్పత్తులు, కాలం-పని, కాలం-దూరం, రైళ్లకు సంబంధించిన సమస్యలు, క్షేత్రగణితం (మెన్సురేషన్) తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు షార్ట్‌కట్స్‌పై దృష్టి సారించకుండా ముందుగా కాన్సెప్ట్‌ను తెలుసుకోవాలి. ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు అందులో ప్రశ్నలుగా వేటిని అడిగే అవకాశం ఉందో పరిశీలించాలి. ఉదాహరణకు కాలం-దూరం అంశాన్ని తీసుకుందాం. ఇందులో ప్రశ్నలు ఒక వ్యక్తి ప్రయాణించిన దూరం లేదా ఒక వ్యక్తి ప్రయాణించిన కాలం, లేదా ఒక వ్యక్తి ప్రయాణించిన వేగం… ఇలా ఈ మూడు అంశాలను అడిగే అవకాశం ఉంది. అంటే ఈ అధ్యాయంలో మొత్తం ప్రశ్నలు దూరం, కాలం, వేగంలపై ఆధారపడి ఉంటాయి. ప్రశ్నలు వీటి పైనే ఎక్కువగా ఇస్తుంటారు. ప్రతి లెక్కను అన్ని కోణాల్లో పరిశీలించాలి. అలాగే ఇందులో సాపేక్షవేగం, పడవలు… తదితర అంశాలను జోడించినప్పుడు వచ్చే మార్పులను పరిశీలించాలి. ఇలా ప్రతి అధ్యాయానికి సంబంధించి ఏ అంశాలు అడుగుతారో చూడాలి. ఎలాగూ బోడ్మాస్ ఆధారిత ప్రశ్నలు నిత్యం చేస్తున్నందున కాన్సెప్ట్ ఆధారితంగా ఉండే అర్థమెటిక్ అంశాల్లో షార్ట్‌కట్స్ నేర్చుకోకున్నా వేగంగా సమాధానాన్ని రాబట్టవొచ్చు.
అధ్యాయాలవారీగా పరీక్షలు మేలు
-అభ్యర్థులు అధ్యాయాల వారీగా కూడా పరీక్షలను రాయడం మంచిది. ఒక్కసారిగా అన్ని అధ్యాయాలు పూర్తయిన తర్వాత అన్ని అధ్యాయాలు కలిసి ఉన్న ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అన్ని అధ్యాయాలకు సంబంధించి ప్రాథమిక అంశాలను నేర్చుకోవడానికి 15 నుంచి 20 రోజులకు మించి సమయం తీసుకోరాదు. వెంటనే ప్రిపరేషన్‌ను మొదలుపెడితే, సెప్టెంబర్ చివరినాటికి అన్ని అధ్యాయాలపై అవగాహనతో పాటు పరీక్షలను కూడా పూర్తి చేయాలి. అక్టోబర్ 1 నుంచి పూర్తి స్థాయి మాక్ పరీక్షలకు సిద్ధం కావాలి.
రీజనింగ్
-ఇందులో ఆల్ఫాబెట్ ఆధారిత ప్రశ్నలు, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, ఫజిల్స్, అరేంజ్‌మెంట్స్, డైరెక్షన్స్… తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల సాధారణ తార్కిక సామర్ధ్యం పైన ప్రశ్నలు ఆధారపడి ఉంటాయి. వీటికి సంబంధించి ఎలాంటి బేసిక్స్ ఉండవు. అయితే కొంత తార్కిక పరిజ్ఞానానికి సంబంధించి ట్రిక్స్ తెలుసుకోవాలి.
ఉదాహరణకు కింది ప్రశ్నలను పరిశీలిద్దాం..
In a class of 50 students, the Rank of a candidate is 15 from top, find his rank from bottom? -50 మంది విద్యార్థులు, ఒక విద్యార్థి ర్యాంక్ 15, కాగా చివరి నుంచి అతడి ర్యాంక్ అడిగారు, మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి, 51 నుంచి 15ను తీసివేస్తే, 36 వస్తుంది, ఇదే చివరి నుంచి అతడి ర్యాంక్. ఇలాంటి ట్రిక్స్, ఆల్ఫాబెట్ ఆధారిత అధ్యాయాలు, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్ తదితర అంశాల్లో ఉంటాయి. పోటీ పరీక్షలకు ఉపయోగపడే వివిధ పుస్తకాల్లో వీటిని వివరించారు. మ్యాజికల్ బుక్ ఆన్ ఫజిల్స్ (కుందన్), అనలైటికల్ రీజనింగ్ (పాండే) తదితర పుస్తకాలు ఉపయోగపడుతాయి. వీటిని నేరుగా అధ్యాయాల వారీగా చదివి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇందులోని అంశాలను కూడా సెప్టెంబర్ 30 వరకు చదివి, అక్టోబర్ 1 నుంచి పూర్తి స్థాయి మాక్ పరీక్షకు సిద్ధం కావాలి. రీజనింగ్‌కు సంబంధించి అభ్యర్థులకు కీలకమైంది. ఫజిల్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్. ఇవి సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీలో ఎలాగైతే ప్రతిరోజూ 100 మేర సూక్ష్మీకరణాలను ప్రాక్టీస్ చేస్తున్నామో, అలాగే రీజనింగ్‌కు సంబంధించి కూడా కనీసంగా 5 నుంచి 10 వరకు ఫజిల్స్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం కనుగొనాలి. పరీక్ష జరిగే వరకు కూడా ఈ కసరత్తు నిత్యం కొనసాగుతూనే ఉండాలి.
ఇంగ్లిష్
-దీనిలో కాంప్రెహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, జంబుల్డ్ సెంటెన్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. కేవలం గ్రామర్ నేర్చుకున్నంత మాత్రాన, ఈ విభాగంలో మార్కులను సాధించలేం. సందర్భోచితంగా పదాలను అర్థం చేసుకునే సామర్ధ్యం అలవర్చుకోవాలి. నిత్యం అధ్యయనమే దీనికి పరిష్కారం. ఆంగ్ల దినపత్రికలలో వచ్చే సంపాదకీయాలు, ఆ పేజీలోనే వచ్చే వ్యాసాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అలాగే తెలియని పదాలు తారసపడినప్పుడు అక్కడికక్కడే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకునే సామర్ధ్యాన్ని అలవరుచుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, రాజకీయ, తాత్విక, ఆర్థిక అంశాలకు సంబంధించిన వ్యాసాలను చదవాలి. అలాగే నిత్యం కొన్ని కొత్త పదాలను తెలుసుకోవాలి. ఆ పదాలతో ఉండే పదబందాలు (ఇడియమ్స్), సామెతలు (ప్రొవర్బ్స్), నుడికారాలు ఏవైనా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇందుకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే గ్రామర్‌కు సంబంధించి వాక్య నిర్మాణం, అందులో భాషా భాగాలను ఉపయోగించే తీరును తెలుసుకోవాలి. వాటిని అన్వయించగలిగే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాలి. నిత్యం ప్రాక్టీస్ ద్వారానే ఇది సాధ్యం. పాత పరీక్ష పత్రాలను పరిశీలించడం కూడా మేలు. పరీక్ష కోణం కూడా అలవడుతుంది.
ప్రిపరేషన్ రెండోదశ
-సెప్టెంబర్ 30 నాటికి అన్ని ప్రాథమిక అంశాలను పూర్తి చేయాలి. అప్పుడు ప్రిపరేషన్‌లో రెండో దశ ప్రారంభమైనట్టు. అక్టోబర్ 1 నుంచి నిత్యం పూర్తిస్థాయి మాక్ పరీక్ష రాయాలి. అనేక ప్రైవేట్ సంస్థలు ఆన్‌లైన్ మాక్ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అభ్యర్థులు తమకు నచ్చిన సంస్థను ఎంచుకుని రాయాల్సి ఉంటుంది. సాధ్యమైనన్ని ఎక్కువ మాక్ పరీక్షలు రాయడం ద్వారా గరిష్ట స్థాయిలో లబ్ధి ఉంటుంది. కనీసం 60 నుంచి 70 వరకు పరీక్ష లను రాయాలి. ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి.bank-clerk2
ఐబీపీఎస్ షెడ్యూల్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం -ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 9 -పరీక్షతేదీలు: డిసెంబర్ 7 నుంచి ప్రారంభం (డిసెంబర్ 7, 8, 14, 21) -ఫలితాల వెల్లడి: డిసెంబర్ చివరివారంలో -మెయిన్స్ పరీక్షకు హాల్‌టికెట్ డౌన్‌లోడ్: జనవరి 2020 -మెయిన్స్ పరీక్ష: 2020, జనవరి 19 -తుది ఫలితాలు-ఏప్రిల్ 2020
చదవాల్సిన పుస్తకాలు
-ప్రాథమిక అంశాలకు సంబంధించి మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. క్లాస్‌మేట్ అకాడమీ వారి కాన్సెప్ట్ ఆఫ్ అర్థమెటిక్ లేదా అగర్వాల్ పబ్లిషర్స్ ప్రచురించిన అర్థమెటిక్, లేదా ప్రతియోగితా కిరణ్.. ఇలా అభ్యర్థి తనకు ఇష్టమైన ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకొని, ముందుగా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. -అభ్యర్థులు ప్రారంభంలో కేవలం ప్రిలిమ్స్‌పైనే దృష్టి సారించాలి -మెయిన్స్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటాయి. అదనంగా కంప్యూటర్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఉంటుంది.
ప్రిలిమ్స్ పరీక్ష ముగిశాక వీటిని చదవచ్చు
-నిత్యం రెండు మాక్ పరీక్షలు రాసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఐబీపీఎస్ పరీక్ష స్లాట్ వేళల్లో రాయడం మంచిది -రీజనింగ్‌కు సంబంధించి ఫజిల్స్, న్యూమరికల్‌కు సంబంధించి బోడ్మాస్ ఆధారిత సూక్ష్మీకరణాలు, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ నిత్యం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. పరీక్ష ముగిసే వరకు దీన్ని కొనసాగించాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button