Andhra PradeshEducationNational & InternationalSocialTelanganaTop NewsUncategorized

19TH APRIL 2020 || KCR PRESS MEET UPDATES || TS LOCKDOWN UPDATE NEWS

TS LOCKDOWN UPDATE NEWS

 

19TH APRIL 2020 || KCR PRESS MEET UPDATES || TS LOCKDOWN UPDATE NEWS

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్……

*మే 7వ తేదీ వరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగు తుంది.
*తెలంగాణ కు వచ్చిన విదేశీ ప్రయాణికులు 100% కోలుకున్నారు.
* ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాము.
*అన్ని సర్వేల్లో లాక్ డౌన్ పొడగించాలని వచ్చింది.
* తెలంగాణ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంటుంది.
* మే ఐదవ తేదీన మరోసారి మంత్రి వర్గ సమావేశం.
* వ్యాధిని నివారించడంలో విఫలం కావద్దు.
* కంటోన్మెంట్ లో ఉన్న ప్రజలు బయటకు రావద్దు.
* మే 7వ తేదీ వరకు విమాన ప్రయాణికులు తెలంగాణకు రావద్దు.
* దేశంలో విమాన సర్వీసులు ఎక్కడ నడిచినా తెలంగాణకు మాత్రం రావడానికి వీల్లేదు.
* పిజ్జా, జుమాటో సేవలు నిలిపివేత.
* బయట నుంచి ఎవరూ కూడా తినుబండారాలను తెప్పించు కోవద్దు.
* హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు ఎవరూ కూడా ప్రార్థనలు పూజలు, చేయడానికి వీలులేదు.
* ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలను అనుమతించేది లేదు.
*ప్రజల సహకారం మరువలేనిది.
* పారిశుద్ధ్య నిర్వహణ లో మున్సిపల్ గ్రామ పంచాయతీల పనితీరు భేష్.
* ఢిల్లీలో పిజ్జా హట్ ద్వారా అరవై తొమ్మిది మందికి పాజిటివ్.
* రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలి తో బాదపడకూడదు.
* ఉద్యోగులకు వేతనాల్లో 50%, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత. గత నెల మాదిరి గానే ఏప్రిల్ మాసంలో అందివ్వడం జరుగుతుంది.
* వైద్యులు,పోలీసులకు నెలవారి జీవితంలో 10% గ్రాస్ అదనంగా ఇస్తాం.
* అన్ని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు 100% వేతనాలు.
* మార్చి, ఏప్రిల్, మే మాసాలకు యజమానులు అద్దెను తీసుకోవద్దు.
* అద్దెకు ఉంటున్న కుటుంబాలను యజమానులు ఎవరూ కూడా ఇబ్బంది పెట్టవద్దు, యజమానులు ఇబ్బందులకు గురి చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.
* ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు కట్టమని బలవంతం చేస్తే కఠిన చర్యలు.
* పరిస్థితి చక్కబడిన తరువాత చూసుకోవచ్చు.
* తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తి గతంగా 12 కిలోల బియ్యం, రూ 1500 కూడా అందజేయాలని ఆదేశించడం జరిగింది.
* రాష్ట్రంలోని 40 లక్షల మందికి ఆసరా ఫింఛన్లు యధావిధిగా అందిస్తాం.
* బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన రూ.1500 వెనక్కి పోతాయని ఎవరూ కూడా భయపడవద్దు.
* వైద్యులు ధైర్యం కోల్పోకుండా పని చేస్తున్నారు వారికి నా అభినందనలు.
* గచ్చిబౌలి స్టేడియం లోని 540 గదులు ఉన్న భవనం తో పాటు పక్కనే ఉన్న 9 ఎకరాల స్థలాన్ని ఆరోగ్య శాఖకు అప్పగించాం. ఇందులో కోవిడ్ ట్రీట్ మెంట్ కోసం వినియోగిస్తాం.
* కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఇందులో వైద్య సేవలు అందిస్తాం.
* తెలంగాణలో క్రీడా సమగ్ర విధానాన్ని అమలు చేసేందుకు కేబినెట్‌లో చర్చించాం.
* దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
* యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
* రాష్ట్రంలో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగుతుంది.
* వచ్చే వర్షాకాలం సీజన్ లో ప్రాజెక్టు, బోరు, వర్షాధారంగా ఒక కోటి 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉంది.
* వర్షకాలం సీజన్ లో పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్న రైతులు మే మాసంలో యూరియా, పెస్టిసైడ్స్ ను కొనుగోలు చేయాలి.
* ఎరువులను స్టాక్ ఉంచుకునేందుకు ఫంక్షన్ హాల్స్ ను తాత్కాలిక గోదాముల కింద వినియోగించుకోవాలి.
* మే నెలలో ఏలాంటి పెళ్లిళ్లు ఫంక్షన్లు విందులు వినోదాలు ఉండవు, ఫంక్షన్ హాల్స్ ను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వాడుకోవాలి.
* పండుగలన్నీ ఇంట్లోనే చేసుకోవాలి.
* లాక్ డౌన్ ను అత్యంత కఠినంగా అమలు జరిగేలా సహకరించాలి.
* 50 వేల వాహనాలను సీజ్ చేశాం, అనవసరంగా బయటకు ఎందుకు వస్తున్నారు, దయచేసి ఇంట్లో నుంచి రాకండి వ్యాధి ప్రమాద స్థాయిలో ఉంది, ఏ మూలకు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు.
* జొమాటో, స్విగ్గీ మూసివేస్తే ప్రభుత్వానికి వచ్చే టాక్స్ పోతుంది, అయినప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.
* విమాన ప్రయాణికుల్లారా హైదరాబాద్ కు రాకండి కష్టాలు కొని తెచ్చుకోకండి..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button