Adjustment of VRAs in Revenue today TS
నేడు రెవెన్యూలో వీఆర్ఏల సర్దుబాటు
రెవెన్యూ శాఖలో బుధవారం వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ హైదరాబాద్ సీసీఎల్ఏలో జరుగనున్నది. 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్హత ఆధారంగా వారికి ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేసింది. వీరిలో 16,758 మంది 61 ఏండ్లలోపు వయసున్న వారు ఉన్నారు. వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే సుమారు 15 వేల పోస్టులను మంజూరు చేసింది.
కలెక్టర్లు జిల్లాల వారీగా వీఆర్ఏల విద్యార్హత, వయసు తదితర అంశాలవారీగా జాబితాను సేకరించి, ప్రభుత్వానికి అందజేశారు. రెవెన్యూ శాఖ వారికి అలాట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నది. నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖలోని ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలి. అపాయింట్మెంట్ పూర్తికాగానే తహసీల్దార్లు తమ పరిధిలో నుంచి వీఆర్ఏలను రిలీవ్ చేస్తారు.