AISSEE 2025
సైనిక్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఇక్కడ చదివితే ఆఫీసర్ ర్యాంక్ జాబ్స్ పక్కా..
అద్భుతమైన విద్యా, ఆధునిక సౌకర్యాలు ఉండే సైనిక్ స్కూల్లో ప్రవేశాల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. మంచి నాణ్యతతో కూడిన విద్యతో పాటు దేశ సేవలో భాగస్వామ్యం అవ్వాలనుకునే విద్యార్థులు.. ఈ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. భారత భద్రత కోసం నిరంతరం పనిచేసే త్రివిధ దళాల్లో అధికారుల్ని విద్యార్థి దశ నుంచే తయారు చేసేందుకు కేంద్రం సైనిక పాఠశాలల్ని నెలకొల్పింది. కాగా.. ఇందులో చదువుకున్న విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఆఫీసర్ హోదాల్లో ఉద్యోగాలు లభిస్తుంటాయి. కాగా.. సైనిక పాఠశాలల్లో వచ్చే ఏడాది (2025-26)లో చేపట్టనున్న ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నోటిఫికేషన్ లోని విషయాలు..
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు 2025 జనవరి 13న సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తారు. ఈ పాఠశాలలు సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ లతో పాటు ఇతర శిక్షణా అకాడమీలకు కావాల్సిన క్యాడెట్లను.. ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల నుంచే సిద్ధం చేస్తుంటారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆఫ్ లైన్ విధానంలోనే పరీక్ష ఉంటుంది. OMR షీట్, పెన్నుతోనే పరీక్షను పెడతారు. చాలా మంది ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తారనుకుంటారు.. కానీ కాదు. ప్రశ్నాపత్రంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 190 పట్టణాలు /నగరాల్లో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను ప్రస్తుతానికి ప్రకటించలేదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత.. ఆ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు.
ఆరో తరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. అలాగే, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15 ఏళ్లు మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.
దరఖాస్తు రుసుం: జనరల్/రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు రూ.800 లుగా నిర్ణయించగా, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.650ల చొప్పున పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేది : జనవరి 14 రాత్రి 11.50 గంటల వరకు ఉంది.
పరీక్ష సమయం: ఆరో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు) 150 నిమిషాలు
తొమ్మిదో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు) 180 నిమిషాలు
ఆరో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా :- లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 150 మార్కులు; ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
తొమ్మిదో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు :- మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు; ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; ఇంగ్లీష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సైనిక పాఠశాలల్లో పిల్లల్ని చదివించాలనుకునే వారికి.. ఈ నగరాలు / పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే.. అనంతపురం, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం
తెలంగాణ విద్యార్థులు సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం హైదరాబాద్, కరీంనగర్ లలోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.