AP Anganwadi Jobs 2023 || ts wdcw jobs 2023
ఏపీలో అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాల (AP Anganwadi Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 71, విజయనగరం జిల్లాలో 78 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాల (AP Anganwadi Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 71, విజయనగరం జిల్లాలో 78 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఆ లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం జిల్లాలో..
జిల్లాలోని గంట్యాడ, భోగాపురం, రాజాం, వీరగట్టం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం(యు), బొబ్బిలి, బాడంగి, గణపతినగరం, సాలూరు(ఆర్), ఎస్.కోట, వియ్యంపేట లో ఈ ఖాళీలు ఉన్నాయి.
వేతనం: అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500, మినీ అంగన్ వాడీ వర్కర్ కు రూ.7 వేలు, అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేల వేతనం ఉంటుంది.
– దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.