Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

AP DSC Notification 2025 Out, Online Form for 16738 Teachers Vacancies 2025

AP DSC Notification 2025

 

 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఈ నెల 20వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు..

 

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఈ నెల 20వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ పోస్టులు ఉండటంతో పోటీ తీవ్రత కూడా అదే స్థాయిలో ఉండనుంది.

 

 

మొత్తం ఉద్యోగాల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులుండగా.. రాష్ట్ర, జోనల్‌ స్థాయుల్లో 2259 వరకు కొలువులు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో ఎస్‌జీటీ ఉద్యోగాలు 6599 ఉంటే, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 7487 ఉన్నాయి. ఇవికాకుండా వ్యాయామ టీచర్‌, ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి. అన్ని పోస్టులకు అంటే టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీ పోస్టులకు టెట్‌లో అర్హత తప్పనిసరి. ఈ పోస్టులకు టెట్‌లో వెయిటేజి 20 శాతం ఉంటుంది.

 

కానీ ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు మాత్రం టెట్ అవసరం లేదు. ఈ మూడు రకాల పోస్టులకు పేపర్‌ 1 గా ఇంగ్లిష్‌ స్కిల్‌ టెస్ట్ ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్‌ 2 మార్కులు లెక్కిస్తారన్నమాట. బీఈడీ, డీఈడీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు అనర్హులు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2678 పోస్టులున్నాయి. 543 పోస్టులతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది.

 

డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంటే డీఎస్సీ 80 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర (1/2)మార్కు కేటాయిస్తారు. డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 6 నుంచి ప్రారంభమై జులై 6 వరకూ జరుగుతాయి.

 

 

AP DSC Notification 2025 Full Details

 

 

Related Articles

Back to top button