AP High Court Jobs 2022
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ (AP High Court Jobs) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్లను (AP High Court Job Notifications) విడుదల చేసింది. కోర్టు మాస్టర్&పర్సనల్ సెక్రటరీ విభాగాల్లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. మొత్తం 76 ఖాళీలను ఈ నోటిఫికేన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు అధికారులు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఈ నియమకాలను చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఈ నెల 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులు ఆ తేదీలోగా చేరాలా పంపాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
\1\6ఖాళీలు విద్యార్హతల వివరాలు:
కోర్ట్ మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ (COURT MASTER AND PERSONAL SECRETARY TO THE HON’BLE JUDGES AND REGISTRARS) విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు:
Open Competition | 28 (12 W) |
Open Competition | (OH) 1 |
Open Competition | (Sports) 1 |
Ex-Servicemen | 1 |
EWS | 8(1 w) |
BC-A s | 5 (1 w) |
BC-B | 7 (2W) |
BC-D | 6 (1w) |
BC-E | 3 |
SC | 11 (4 W) |
ST | 5(1 w) |
Total: | 76 Posts (22W) |
విద్యార్హతల వివరాలు:
డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్) విద్యార్హతలను కలిగి ఉండాలి. ఇంకా ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి: దరఖాస్తుదారుల వయోపరిమితి జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.147760 వరకు వేతనం చెల్లించనున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Step 1: అభ్యర్థులు దరఖాస్తులను https://hc.ap.nic.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Step 2: ఆ దరఖాస్తులను పూర్తిగా నింపి రిజిస్టార్ (అడ్మినిస్ట్రేషన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి , గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
Step 3: దరఖాస్తులు ఈ నెల 22వ తేదీలోగా చేరేలా పంపాల్సి ఉంటుంది.