Center good news for farmers… Increase PM Kisan fund from 6 to 8 thousand..!
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్... పీఎం కిసాన్ నిధిని 6 నుంచి 8 వేలకు పెంపు..! 2023

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ చివరిది కావడంతో వీలైనంత మేరకు ప్రజాకర్షణగా రూపొందించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదే నేపథ్యంలో రైతులకు ప్రతీ ఏడాది అందించే పీఎం కిసాన్ సమ్మన్ నిధిని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే…!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రత్యేకత సంతరించుకుంది. 2024లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. బడ్జెట్‌లో ముఖ్యంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక ప్రకటనలు ఉండవచ్చని సమాచారం.
పెంచిన తర్వాత ఖాతాల్లో జమ.!
వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్న 13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను త్వరలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా, భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది కేంద్రం. దీనికి సంబంధించి ఈ పథక లబ్ధిదారులైన రైతులకు కేంద్రం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. ఓ నివేదిక ప్రకారం ఈ బడ్జెట్‌లో రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వాయిదా మొత్తాన్ని పెంచే అవకాశం ఉంది.
నాలుగు విడుతలలో జమ..!
గతంలో ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు నగదుని 3 వాయిదాలో కేంద్రం రైతు బ్యాంకు ఖాతాలో జమ చేసేది. తాజాగా ఆ మొత్తాన్ని రూ.8వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా రైతులకు ఇచ్చే మొత్తాన్ని రూ.2వేలు చొప్పున 4 విడతలుగా విభజించనుంది. ఈ బడ్జెట్ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
PM Kisan Status List – Beneficiary Status