Conditions for free electricity. Telangana government to give these documents
ఉచిత విద్యుత్‌కి కండీషన్లు. ఈ పత్రాలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఐతే కొన్ని కండీషన్లు పెట్టింది. అవేంటో తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ప్రభుత్వ పథకాలు పొందడం చాలా కష్టమైపోతోంది. పథకాలు ఇచ్చే ప్రభుత్వాలు బోలెడు కండీషన్లు పెడుతున్నాయి. దాంతో ప్రజలకు ఆ కండీషన్లను నెరవేర్చడం కష్టమైపోతోంది. దాంతో పథకాలను చాలా మంది పొందలేకపోతున్నారు. తాజాగా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చే గృహ జ్యోతి పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల్ని అధికారులతో రెడీ చేయించింది. అవేంటో తెలుసుకుందాం.
ఇవీ కండీషన్లు
అర్హులైన కుటుంబాల్లో నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అమలవుతుంది. ఐతే.. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ మీటర్లు ఉండకూడదు. అది అద్దె ఇల్లు అయితే, ఆయా పోర్షన్లలో ఉండేవారికి విడివిడిగా మీటర్లు ఉండొచ్చు. తద్వారా ఎవరికి వారు పథకాన్ని పొందవచ్చు.
అద్దె ఇంట్లో పోర్షన్లలో ఉండేవారు తమ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, రేషన్ కార్డును అప్లికేషన్‌తో జత చెయ్యాలి. తెలంగాణ ప్రాంతానికి చెందని వారికి ఈ పథకం వర్తించదు. ఊళ్లలో ఇల్లు ఉండి, హైదరాబాద్ లాంటి చోట అద్దె ఇళ్లలో ఉండేవారు, ఏదో ఒక చోట మాత్రమే పథకం కోసం అప్లై చేసుకోవాలి.
ఎలా అప్లై చేసుకోవాలి?
గృహజ్యోతి పథకం కోసం అప్లై చేసుకోవడానికి మీసేవా కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఏ ఆఫీసుకీ వెళ్లాల్సిన అవసరం లేదు. స్థానిక అధికారులు, JLMలు ఇంటింటికీ వస్తారు. అప్పుడు వారు మీటర్ నెంబర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డు నెంబర్ తీసుకుంటారు. అలా అర్హులుగా చేరుస్తారు.
జీరో బిల్లు:
పథకం అమల్లోకి వచ్చాక, నెల తర్వాత బిల్లు తీసేందుకు వచ్చేవారు, ఇంటికి వచ్చి, జీరో బిల్లు తీసి ఇస్తారు. ఆ బిల్లుకి మనీ చెల్లించాల్సిన పని లేదు. ఐతే.. 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లు వాడితే, ఆ వాడకానికి మాత్రం బిల్లు ఇస్తారు. ఆ బిల్లును తప్పక చెల్లించాలి.
ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చేదీ ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అధికారులు ఇళ్లకు వెళ్లే పని జరుగుతోంది. వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.