Andhra PradeshNational & InternationalSocialTelanganaTop News

CORONA VIRUS LATEST UPDATE BREAKING NEWS TODAY

 

CORONA VIRUS LATEST UPDATE BREAKING NEWS TODAY

 

కరుణ వ్యాధికి భీమా పాలసీలు వర్తింపు.?

సాధారణ బీమా పాలసీలకు కరోనా వైరస్‌ (కోవిడ్‌ –19) కవరేజ్‌ ఉందని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. అంటువ్యాధులకు బీమా వర్తిస్తుందని, ఇందులో భాగంగానే ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు సైతం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుందని బీమా రంగంలోని 44 కంపెనీలను సభ్యులుగా కలిగి ఉన్న కౌన్సిల్‌ స్పష్టంచేసింది. ఈ అంశంపై చైర్మన్‌ ఏ.వీ గిరిజా కుమార్‌ మాట్లాడుతూ.. ‘దాదాపు మనుగడలో ఉన్న అన్ని ఆరోగ్య బీమా పాలసీలకు కరోనా కవరేజ్‌ ఉంది. ఈ విషయాన్ని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) బుధవారం ప్రకటించింది. కవరేజ్‌ వర్తింపజేయడం కోసం కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం లేదని, ఈ వ్యాధి కేసులకు త్వరితగతిన చికిత్స అందేలా చూడాలని పరిశ్రమను మాత్రమే ఐఆర్‌డీఏఐ కోరింది’ అని వ్యాఖ్యానించారు.

అయితే ఐఆర్‌డీఏఐ సర్క్యులర్‌పై సుబ్రమణ్యం బ్రహ్మజోయిసులా (అండర్ రైటింగ్ అండ్ రీఇన్స్యూరెన్స్‌ హెడ్‌) వ్యాఖ్యానిస్తూ సంబంధిత వ్యక్తి కనీసం 24 గంటలు ఆసుపత్రిలో చేరినట్లయితే భారతదేశంలో చాలా ఆరోగ్య బీమా చెల్లిస్తాయన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా భారత ప్రభుత్వం ఒక మహమ్మారిగా ప్రకటించినట్లయితే, బీమా చెల్లింపు ఉండదని తెలిపారు. తమ హాస్పిటలైజేషన్ పాలసీల కింద పాలసీదారులకు బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని మాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సీఎండీ ఆశిష్ మెహ్రోత్రా తెలిపారు. ఏదేమైనా, రోగి క్వారంటైన్‌ లో ఉంటే క్లెయిమ్‌లను పరిష్కరిస్తారా అనే దానిపై బీమా సంస్థలు మౌనంగా ఉన్నాయి.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button