Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
DSC 2024 Exams Dates
గుడ్‌న్యూస్.. డీఎస్సీ-2024 పరీక్ష తేదీలు ఇవే.. దరఖాస్తు గడువు కూడా..
11,062 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ విద్యా శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే ఈ పోస్టుల దరఖాస్తు గడువు ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్న విషయం తెల్సిందే. అయితే అభ్యర్థుల విన్నపం మేరకు ఈ దరఖాస్తు గడువును జూన్ 20వ తేదీ వరకు పొడిగించింది.
డీఎస్సీ అభ్యర్థులు రూ.1000 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి జూన్ 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చును. అలాగే డీఎస్సీ పరీక్షల తేదీలను కూడా ఖారారు చేసింది. ఈ డీఎస్సీ 2024 పరీక్షలను జూలై 17వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.