Farmer loan waiver should be completed quickly 2023
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీపై సిద్దిపేట కలెక్టరేట్ లో బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో 1,72,592 మంది రైతులకు రూ. 1321 కోట్లు మంజూరు కాగ 81,237 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ రూ. 440.18 కోట్లు జమ చేయబడ్డాయన్నారు. 59, 712 రైతులు రూ. 343.39 కోట్ల నగదు రూపంలో రైతులు వారి ఖాత నుండి తీసుకోవడం జరిగిందన్నారు. 21, 000 మంది రైతులు క్రాప్ లోన్ రెన్యూవల్ చేసుకోవాలని కోరినట్లు తెలిపారు.
వివిధ బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న రుణాలను త్వరగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. రైతులకు నూతనంగా క్రాప్ లోన్ అందించేందకు రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ..మున్సిపాలిటీల పరిధిలోని 1384 మంది విధి వ్యాపారులకు వారం రోజుల్లో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్లను ఆదేశించారు.
ఆహర ఉత్పత్తి పీఎంఎప్ఎంఈ పరిధిలో గల 87 యూనిట్లు, పెండింగ్ లో ఉన్న 10 ట్రైకర్ రుణాలు, 118 ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వారం రోజులల్లో లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సత్యజిత్, డీఎఓ శివప్రసాద్, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, బ్యాంకు, మెప్మా, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.