Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Farmers News Today Live

రైతులకు అదిరే శుభవార్త.. ఎకరాకు రూ.12 వేలు, ఇలా చేస్తే చాలు!

 

రైతులకు గుడ్ న్యూస్. ఇలా చస్తే రూ.12 వేలు వరకు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.

 

కొన్ని పంటలు రైతులకు తీవ్రనష్టాలు కలిగిస్తాయి. మరికొన్ని పంటలు మాత్రం రూపాయి పెట్టుబడి లేకుండా పది రూపాయలు లాభాన్ని తెచ్చిపెడతాయి.

 

 

విశాఖ జిల్లాలోని పలు గ్రామాల్లో జనుము సాగు ఎక్కువగా చేస్తూ రైతులు అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. ఈ జనుము పంట వేయాలి అంటే ఖరీఫ్‌ వరి పంట కోత దశలో ఉన్నప్పుడు ఒక ఎకరాకు 2 కేజీలు విత్తనాలు వేసుకోవాలి. అనంతరం వరి పంటను కోత కోసిన కొద్ది రోజులకే జనుము విత్తనాలు మొలకెత్తుతాయి.

మన దగ్గర విత్తనాలు వుంటే చాలు ఖర్చు లేకుండా రైతులకు అధిక లాభాలను సాధించవచ్చు అంటున్నారు రైతు విట్టం శెట్టి రాజుబాబు. పంట దశకు చేరుకున్నప్పుడు జనుము పంట సుందరంగా కనువిందు చేస్తూ అందర్నీ ఆకర్షిస్తుంది అంటున్నారు.

సారవంతంతో పాటు ఆదాయం కూడా..అయితే కొద్ది సంవత్సరాలుగా జిల్లాలోని రైతులు జనుము పంటకి ఆదాయం పంటగా మార్చుకున్నారు. ఖరీఫ్‌ అయిన వెంటనే వరి పొలాల్లో రైతులు జనుము పంట సాగు చేస్తున్నారు. ఈ జనుము పంట ఆదాయం తో పాటు భూమిలో కుళ్ళిపోతే ఎంతో సార్వంతంగా తయారవుతుంది.

ప్రస్తుతం జిల్లాలోని వందలాది ఎకరాల్లో జనము పూతదశలో ఈ పంట ఉంది. ఎటువంటి పెట్టుబడి లేకుండా పురుగుల మందు బాధ పెద్దగా లేకుండా ఈ జనుము పంట పండుతుంది.

ఈ జనుము పంట ఎకరాకు సుమారు రూ.10వేలు నుండి 12 వరకు ఆదాయం వస్తుందని రైతు విటం శెట్టి రాజుబాబు చెబుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కిలో జనుము కేజీ రూ. 50 నుండి రూ.60 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మినప సాగుకు కొంత మొత్తం లో తెగుళ్ల బెడద పట్టుకుంది.

మినప మొక్కలు పూత తక్కువగా ఉండడం , తెగులు రావడం వలన మినప సాగుకు ఆశాజనకంగా లేదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మినప పంట కంటే జనుము పంట బాగుంది అంటూ రైతులు తెలుపుతున్నారు.

 

Related Articles

Back to top button