Farmers should repay agricultural loans on time 2023
రైతులు వ్యవసాయ రుణాలను సకాలంలో చెల్లించాలి
దిశ రైతులు వ్యవసాయ రుణాలను (క్రాప్ లోన్లను) సకాలంలో చెల్లించాలని ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ జి. సుభాష్ తెలిపారు. శుక్రవారం దుద్యాల మండలంలోని హకీంపేట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ (ఏపీజీవీబీ) బ్యాంకును నూతన భవనంలోకి మార్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో రుణాలు చెల్లించడం వల్ల, వడ్డీ రాయితీ తగ్గడమే కాక,10 శాతం శాతం లోన్ అదనంగా లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బంగారం ఆభరణాలపై, డ్వాక్రా సంఘాలకు 20 లక్షల వరకు రుణాలు (లోన్లు) ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క ఖాతాదారుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవి కిషోర్ రెడ్డి, రవికాంత్హ, హరీష్ కుమార్, రాంబాబు, గజేంద్ర, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రైతులు వ్యవసాయ రుణాలను (క్రాప్ లోన్లను) సకాలంలో చెల్లించాలని ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ జి. సుభాష్ తెలిపారు. శుక్రవారం దుద్యాల మండలంలోని హకీంపేట్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ (ఏపీజీవీబీ) బ్యాంకును నూతన భవనంలోకి మార్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
సకాలంలో రుణాలు చెల్లించడం వల్ల, వడ్డీ రాయితీ తగ్గడమే కాక,10 శాతం శాతం లోన్ అదనంగా లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బంగారం ఆభరణాలపై, డ్వాక్రా సంఘాలకు 20 లక్షల వరకు రుణాలు (లోన్లు) ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క ఖాతాదారుడు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవి కిషోర్ రెడ్డి, రవికాంత్హ, హరీష్ కుమార్, రాంబాబు, గజేంద్ర, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.