Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
Good news for Telangana Anganwadi Teachers
Telangana Anganwadi Teachers latest news
జిల్లాకేంద్రంలో గురువారం వనపర్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు నూతన సిలబస్‌లో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యపై సీడీపీఓ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీబాయి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిధిలో 230 మందిలో అంగన్‌వాడీ టీచర్లు ఉండగా 7 బ్యాచులుగా విభజించి ఒక్కో బ్యాచ్‌కు 3 రోజుల పాటు నూతన జాతీయ విద్యా విధానం ప్రేమ్‌వర్క్ 2022 ప్రకారం శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
శిక్షణ తరగతులు ఈ నెల 28 వరకు కొనసాగుతాయని చెప్పారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఎస్ బీసీ శేఖర్, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.