Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel

All India level State wise government jobs 2023 || AP, TS circle government job updates 2023

Latest Government Jobs Notifications 2023

 

 

 

 

 

SSC Recruitment 2023: నిరుద్యోగులకి శుభవార్త.. SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్‌.. 30 ఏళ్లవారు కూడా అర్హులే..!

 

 

 

SSC Recruitment 2023

 నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికింద కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5369 పోస్టులని భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత అయి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 27 మార్చి 2023 వరకు సమయం కేటాయించారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఆన్‌లైన్ మార్గాల ద్వారా రూ.100 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులందరూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ డేటాఎంట్రీ టెస్ట్‌/ కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7,914 ఉద్యోగాలకు నోటిఫికేషన్

పదో తరగతి అర్హతతో ఉద్యోగం పొందే అవకాశాన్ని ఇండియన్‌ రైల్వే (Indian Railway) అందజేస్తోంది. గ్రూప్ డి పోస్టుల ప్రకటన అనంతరం మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా 7,914 ఖాళీలను భర్తీ చేయనుంది.

 

 

దేశంలోనే ఎక్కువ మంది ఇండియన్‌ రైల్వేలో (Indian Railways) ఉపాధి పొందుతున్నారు. రైల్వేలో ఉద్యోగం కోసం చాలా మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పదో తరగతి అర్హతతో ఉద్యోగం పొందే అవకాశాన్ని ఇండియన్‌ రైల్వే అందజేస్తోంది. గ్రూప్ డి పోస్టుల ప్రకటన అనంతరం మరో భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా 7,914 ఖాళీలను భర్తీ చేయనుంది. సౌత్ సెంట్రల్ రైల్వే (SCR), సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER), నార్త్ వెస్టర్న్ రైల్వే(NWR) జోన్ల పరిధిలో రిక్రూట్‌మెంట్‌ జరుగుతుంది. ఏ జోన్ పరిధిలో ఎన్ని ఖాళీలున్నాయి? ఎవరెవరు అర్హులు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

 

 

 

 

అర్హతలు

విద్యార్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(SCVT) ధ్రువీకరించిన ఐటీఐ ఉత్తీర్ణత సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

 

వయసు: రిక్రూట్‌మెంట్ బోర్డు పేర్కొన్న వివరాల ప్రకారం.. 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయసున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023, జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 24 ఏళ్లు మించకూడదు. అదే విధంగా 15 ఏళ్లు తగ్గకుండా ఉండాలి. రిజర్వ్‌డ్ అభ్యర్థులకు వయసు మినహాయింపు ఉంటుంది.

 

 

 

 

 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొత్త జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి పోస్టులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ద్వారా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ జరిగేలోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్, పదోన్నతులు, ఇన్‌చార్జి బాధ్యతల అప్పగింత ద్వారా త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

 

 

 

ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి కార్యదర్శులకు సూచిం­చారు. ఫిబ్ర‌వ‌రి 16వ తేదీన (గురువారం) రాష్ట్ర సచివాలయం ఐద­వ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో సీఎస్‌ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం జరిగింది.

 

ఏపీ గ్రామ, వా­ర్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం, అధికారాల బదిలీ, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్‌ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్‌ఏక్యూ, ఎల్సీ­క్యూలపై సత్వరం సమాచారం అందించడం, తది­త­ర అజెండా అంశాలపై సీఎస్‌ కార్యదర్శులతో సమీ­క్షించారు.

ap cm ys jagan mohan reddy

 

 

► ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ–ఆఫీస్‌ విధానం కింద ఇ–రశీదులు, ఇ–డిస్పాచ్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాల‌న్నారు.

► గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లలో ఆర్థికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల‌న్నారు.

 

 

ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి కీల‌క ఆదేశాలు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఇందులో భాగంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1,2 ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెల్సిందే. అలాగే సీడీపీఓ 63 ఉద్యోగాలకు భ‌ర్తీకి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సీడీపీఓ ఉద్యోగాల‌ను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అయింది. ఈ పోస్టుల భ‌ర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవ‌కాశం ఉంది.

 

 

IMPORTANT LINKS

 

 

1) INDIAN RAILWAY TTE RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

2) DSSSB RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

3) AADARSH VIDYALAY SANGATHAN

Notification PDF

Apply online

Official Website

4) INDIAN BANK RECRUITMENT

 

Notification PDF

Apply online

Official Website

5) ESIC RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

6) ICSIL RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

7) INDIAN RAILWAY RECRUITMENT 2023

Notification PDF

Apply online

Official Website

8) INDIAN POSTAL RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

9) SSC CGL RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

10) UPSC CAPF RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

11) DELHI POLICE RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

12) UPSC CMS RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

13) BSNL RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

14) FCI RECRUITMENT

Notification PDF

Apply online

Official Website

15) ICDS ANGANBADI RECRUITMENT

 

Notification PDF

Apply online

Official Website

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button