Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Group-1 Notification Full Details 2022

తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ (Telangana Group 1 Notification) కు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

 

 

 

 

TSPSC Group 1 Notification: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సర్వం సిద్ధం.. విడుదల ఎప్పుడంటే?

తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ (Telangana Group 1 Notification) కు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో భారీగా ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల (Telangana Group1, Group 2 Jobs) భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాల భర్తీలో పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కార్ (Telangana Government) ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇంటర్వ్యూల రద్దును కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించే వారు. గ్రూప్‌-2 విషయానికి వస్తే.. రాత పరీక్షకు 600 మార్కులు.. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 675 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉండేది.

 

 

అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో రాత పరీక్షల్లో ఏమైనా మార్పులు చేస్తారా? అన్న సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఇంటర్వ్యూలకు ఇప్పటి వరకు కేటాయించిన మార్కులను రాత పరీక్షకు కేటాయించే అవకాశం ఉందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే పరీక్ష పేపర్ మోడల్ కూడా మారే అవకాశం ఉంది. ఇదే జరిగితే నోటిఫికేషన్లు విడుదల కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో గ్రూప్‌-1ను 900 మార్కులకు, గ్రూప్‌-2ను 600 మార్కులకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో నియామక ప్రక్రియ కూడా త్వరలోనే ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.

 

 

 

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం 503 గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్థిక శాఖ సైతం గత నెలలో అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఏ క్షణమైనా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. రోజులు గడుస్తున్నా నోటిఫికేషన్ మాత్రం విడుదల కాకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది. అయితే.. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం.

 

 

ఇందుకు సంబంధించిన కసరత్తు సైతం దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం పబ్లిక్ సర్విస్ కమిషన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తోంది. ఈ మీటింగ్ లో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌పైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఈ నెల 22న కమిషన్‌ మరోసారి సమావేశం కానుంది. 22 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

 

 

TSPSC  Group-1 Notification Full Details 2022

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button