Gurukul PGT Notification 2023
1,276 పీజీటీ పోస్టులకు పూర్తి నోటిఫికేషన్ విడుదల.. అర్హత, దరఖాస్తు విధానం తెలుసుకోండి..
స్సీ వెల్ఫేర్ లో 346 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్‌లో 147 పోస్టులు, బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 786 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలోని(Telangana) లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9 విభాగాల్లోని పోస్టులకు సంబంధించిన వెబ్ నోట్ ను ఇటీవల తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TREI-RB) ఇటీవల విడుదల చేసింది. వీటికి దరఖాస్తు చేసుకోవాలంటే.. ప్రతీ ఒక్కరు ఓటీఆర్ నమోదు చేసుకోవాలని వెబ్ నోట్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 12 నుంచి ఆ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. మొత్తం 9 నోటిఫికేషన్లలో ఇటీవల జేఎల్, డీఎస్ పూర్తి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో డీఎల్ పోస్టులు 868 ఉండగా.. జేఎల్ పోస్టులు 2008 ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి 2023 ఏప్రిల్ 17న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. 2023 మే 17 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి రూ.1,37,000 వరకు వేతనం లభిస్తుంది.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టుల భర్తీకి పూర్తి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు సొసైటీల పరిధిలోని 1,276 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఎస్సీ వెల్ఫేర్ లో 346 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్‌లో 147 పోస్టులు, బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 786 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొదట పూర్తి నోటిఫికేషన్ ను ఏప్రిల్ 24న విడుదల చేస్తామని ప్రకటించినా.. మూడు రోజులు ముందుగానే ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. దీంతో పాటు.. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పూర్తి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేశారు. ఆయా పోస్టులకు ఈనెల 24 నుంచి వచ్చే నెల 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పరీక్షలను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ 1,276 పోస్టుల్లో 966 పోస్టులను మహిళకు కేటాయించారు. ఖాళీలు, వయస్సు, కమ్యూనిటీ, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు TREIRB వెబ్‌సైట్ https://treirb.telangana.gov.in/ ను సందర్శించొచ్చు. సబ్జెక్ట్స్ వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.