Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop NewsTravel

India Postl Notification 2022 || Postal Jobs In AP,TS Postal Jobs 2022

పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. ఏపీలో 3563 ఖాళీలు.. తెలంగాణలో 2513 ఖాళీలున్నాయి.. టెన్త్‌, ఇంటర్‌ పాసైన వాళ్లు అర్హులు

 

 

 

 

 

 

 

 

 

 

 

India Post Office Recruitment 2022

 

 

India Post Office Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్‌ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు 98,083 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రీజియన్ల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్లనున్నట్లు ప్రకటించింది. పోస్టాఫీసుల్లో పోస్ట్‌మ్యాన్, మెయిన్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. తాజాగా విడుదల చేసిన షార్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు 59,099.. మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 1445.. ఎంటీఎస్‌ పోస్టులు 37,539 పోస్టులున్నాయి.

 

 

 

 

పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్, ఇతర ఉద్యోగాల భర్తీకి పదోతరగతి అర్హత ఉంటే సరిపోతుంది. అభ్యర్థులు వయసు 18-32 మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెలలో ఈ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. డిసెంబరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

 

మొత్తం ఖాళీల్లో.. ఏపీ సర్కిల్‌ పరిధిలో 3563 పోస్టులున్నాయి. ఇందులో.. 2289 పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు.. 108 మెయిల్‌ గార్డ్‌ జాబ్స్‌.. 1166 ఎంటీఎస్‌ పోస్టులున్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్‌ పరిధిలో 2513 పోస్టులున్నాయి. ఇందులో 1553 పోస్ట్‌మెన్‌ జాబ్స్‌.. 82 మెయిల్‌ గార్డ్‌ పోస్టులు.. 878 ఎంటీఎస్‌ పోస్టులున్నాయి. త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

ఖాళీల సంఖ్య: 98,083

  • పోస్ట్‌మ్యాన్: 59,099 పోస్టులు
  • మెయిల్ గార్డు: 1445 పోస్టులు
  • మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 37,539

 

 

 

  • అర్హతలు: పోస్ట్‌మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

 

  • వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

 

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

  • ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

  • జీతం: జీతం రూ. 33,718 నుండి రూ. 35,370 వరకు ఉంటుంది.

 

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button