SocialTech news

MLHP Posts In Telangana || 32 జిల్లాల వ్యాప్తంగా మిడ్‌ లెవెల్‌ పోస్టుల భర్తీ.. ఏ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులున్నాయంటే..

MLHP Posts In Telangana || 32 జిల్లాల వ్యాప్తంగా మిడ్‌ లెవెల్‌ పోస్టుల భర్తీ.. ఏ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులున్నాయంటే..

అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్తుంటాం. అక్కడ నాడి పట్టే వైద్యుడు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం వైద్యుల పోస్టులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రికి(Hospital) వెళ్తుంటాం. అక్కడ నాడి పట్టే వైద్యుడు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం వైద్యుల పోస్టులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చింది. తెలంగాణలో బస్తీ, పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా హెల్త్‌ సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానలుగా ప్రభుత్వం మార్చింది. పైసా ఖర్చు లేకుండా సొంతూర్లలోనే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. వీటిలో అవసరమైన సిబ్బంది, వైద్యులు లేకపోవడంతో రోగులకు ఎంతో ఇబ్బంది గా మారింది. ఇక నుంచి ఆ సమస్య ఉండకూడదని.. మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (Mid Level Health Providers) పోస్టుల నియామకాలకు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 956 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది.

 

ఈ మేరకు అర్హత మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ‘మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)’ పేరిట 32 జిల్లాల వ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. వీటిని ఒప్పంద ప్రాతిపదికన నియమించనున్నారు. 956 పోస్టులతో కలుపుకొని.. మొత్తం అర్బన్ ఏరియాల్లో 349, రూరల్ ఏరియాల్లో 1220 మొత్తం 1569 పోస్టులను భర్తీ చేయనున్నారు. పట్టణాలు, పల్లెల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలను బస్తీ, పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దనుండడంతో వాటిలో ఎంఎల్‌హెచ్‌పీల సేవలు అవసరమయ్యాయి. దీంతో 33 జిల్లాల వ్యాప్తంగా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు.

 

 

పల్లె దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్, బీఏఎంఎస్‌తోపాటు స్టాఫ్‌ నర్సులు అర్హులని పేర్కొంది. ఒక వేళ ఎంబీబీఎస్, బీఏఎంఎస్‌ అందుబాటులో లేకపోతే.. బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులకు అవకాశం ఇవ్వనున్నారు. వీరు 2020 తర్వాత ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రొగ్రామ్‌ను పూర్తిచేసిన వారిని పరిగణనలోకి తీసుకోనున్నారు. వైద్యులకు నెలకు రూ. 40 వేలు, స్టాఫ్ నర్సు పోస్టులకు నెలకు రూ.29,900 గౌరవ వేతనం అందిస్తారు. వీటిని కాంట్రాక్ట్ బేసిసిలో తీసుకుంటారు. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 5ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

 

 

దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 17, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తులను ఆయా జిల్లాల డీఎంహెచ్ఓ వెబ్ సైట్ కు వెళ్లి.. దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలో పేర్కొన్న విధంగా వివరాలను నమోదు చేసి.. పోస్టు ద్వారా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, మీరు ఏ జిల్లాకు దరఖాస్తు చేస్తున్నారో ఆ జిల్లా పేరు, తెలంగాణ అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అక్టోబర్ 03, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్భన్ ఏరియాల్లో పోస్టులు మొత్తం 349.. \1\6 జిల్లా పోస్టుల సంఖ్య ఆదిలాబాద్ 2 అసిఫాబాద్ 3 భద్రాద్రి కొత్తగూడెం 13 జగిత్యాల 16 జనగాం 0 జయశంకర్ భూపాలపల్లి 3 జోగులాంద గద్వాల 5 కామారెడ్డి 11 కరీంనగర్ 13 ఖమ్మం 11 మహబూబాబాద్ 8 మహబూబ్ నగర్ 10 మంచిర్యాల 18 మెదక్ 11 మేడ్చల్ 17 ములుగు 0 నాగర్ కర్నూలు 8 నల్గొండ 18 నారాయణపేట 8 నిర్మల్ 5 నిజామాబాద్ 11 పెద్దపల్లి 9 రాజన్న సిరిసిల్ల 6 రంగారెడ్డి 39 సంగారెడ్డి 26 సిద్దిపేట 11 సూర్యాపేట 15 వికారాబాద్ 14 వనపర్తి 10 వరంగల్ 5 హన్మకొండ 8 యాదాద్రి భువనగిరి 15
రూరల్ ఏరియాల్లో పోస్టుల మొత్తం 1220..
జిల్లా పోస్టుల సంఖ్య
ఆదిలాబాద్ 51
అసిఫాబాద్ 53
భద్రాద్రి కొత్తగూడెం 90
జగిత్యాల 35
జనగాం 32
జయశంకర్ భూపాలపల్లి 24
జోగులాంద గద్వాల 21
కామారెడ్డి 70
కరీంనగర్ 01
ఖమ్మం 27
మహబూబాబాద్ 42
మహబూబ్ నగర్ 0
మంచిర్యాల 19
మెదక్ 57
మేడ్చల్ 10
ములుగు 33
నాగర్ కర్నూలు 33
నల్గొండ 78
నారాయణపేట 29
నిర్మల్ 37
నిజామాబాద్ 94
పెద్దపల్లి 20
రాజన్న సిరిసిల్ల 21
రంగారెడ్డి 55
సంగారెడ్డి 76
సిద్దిపేట 71
సూర్యాపేట 29
వికారాబాద్ 48
వనపర్తి 19
వరంగల్ 25
హన్మకొండ 0
యాదాద్రి భువనగిరి 20

 

Notification PDF::- పూర్తి నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

 

District Wise Vacancy Details PDF

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button