Palla Rajeshwar Reddy || మార్గదర్శకాల ప్రకారమే రైతులందరికీ రుణమాఫీ
తెలంగాణలో రుణమాఫీ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
తెలంగాణలో రుణమాఫీ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ తొలి విడతలో 44,870 మంది రైతులకు రూ. 167.59 కోట్లు రుణమాఫీ చేసింది. రూ.37 వేల నుంచి 41 వేల వరకు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరింది. దీంతో రుణమాఫీపై రైతు బంధు సమితి స్పష్టత ఇచ్చింది. రైతు రుణ మాఫీ కోసం ప్రభుత్వం రూ. 20 వేలు కోట్లు కేటాయించిందని రైతు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.
ఆర్థిక పరిస్థితుల వల్లే ఇప్పటి వరకూ రైతు రుణమాఫీ ఆలస్యమైనట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ రెండో వారం వరకు విడతల వారీగా రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. 2018లోపు బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్కు రైతుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. కాంగ్రెస్ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినా ప్రజలెవరూ నమ్మడం లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.