PM Kisan 2024
రైతులకు కేంద్రం సూచన. మనీ వస్తోంది, చెక్ చేసుకోండి

PM Kisan Scheme: ప్రధామంత్రి కిసాన్ స్కీమ్‌ని ప్రతీ రైతూ పొందాల్సిందే. వారికి మనీ అంది తీరాల్సిందే. అప్పుడే ఆ పథకానికి అర్థం ఉంటుంది. ఐతే.. తాజాగా 15వ విడత డబ్బు 2.4 లక్షల మంది రైతుల అకౌంట్లలో పడలేదు. ఎందుకో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తెచ్చింది. దీని కింద ప్రతీ సంవత్సరం 3 విడతల్లో రూ.6వేలను లబ్దిదారులైన రైతుల అకౌంట్లలో జమచేస్తోంది. తాజాగా 15వ విడత డబ్బును కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేసింది. ఐతే.. కొంతమంది రైతుల అకౌంట్లలోకి మనీ రాలేదు. వారు డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా ఈ పథకానికి అర్హులుగా తమ పేరును నమోదు చేయించుకున్నారు. అయినప్పటికీ మనీ రాలేదు. ఇలా ఎందుకు జరిగిందనే అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది.
తాజా రూల్స్ ప్రకారం పీఎం కిసాన్ మనీ పొందే రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. తమ బ్యాంకు అకౌంట్‌లో డబ్బు పడాలంటే.. ఆ అకౌంట్‌కి ఆధార్ నంబర్‌ను లింక్ చెయ్యాలి. అలా చేసిన వారికి మాత్రమే మనీ వస్తోంది. చెయ్యని వారికి డబ్బు రావట్లేదు. ఈ కారణంగానే ఇటీవల 2.4 లక్షల మంది రైతులకు మనీ రాలేదు.
బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ లింక్ చేసుకున్న తర్వాత.. ఆయా రైతులకు రావాల్సిన డబ్బు వారి అకౌంట్ల లోకి వస్తుంది అని కేంద్రం తెలిపింది. అందువల్ల ఆధార్ లింక్ చేసిన రైతులు, తమ అకౌంట్లలోకి మనీ వచ్చిందేమో చూసుకోవాలి. లేదంటే, బ్యాంకుకి వెళ్లి వివరాలు కోరవచ్చు.
బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసుకోవడానికి ముందుగా మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ ఏటీఎంకి వెళ్లాలి. అందులో మీ డెబిట్ కార్డు పెట్టి మీ 4 అంకెల పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సర్వీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్ సెక్షన్‌లో ఆధార్ రిజిస్ట్రేషన ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. ఆధార్ నంబర్ ఇవ్వాలి. మీది సేవింగ్స్ అకౌంటా లేక కరెంట్ అకౌంటా అనేది తెలపాలి. తర్వాత మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ok పై క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆన్‌లైన్‌లో కూడా ఇలా చెయ్యవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి, అక్కడ మీ ప్రొఫైల్‌లోకి వెళ్లి, ఆధార్ నంబర్ ఇవ్వవచ్చు. కొన్ని ప్రత్యేక మీసేవ కేంద్రాల్లో కూడా ఇది చేయించుకోవచ్చు.