PM Kisan Samman Nidhi 2023
రైతుల అకౌంట్లలోకి ఇక రూ.8 వేలు.. నిర్మలా సీతారామన్ తీపికబురు? బడ్జెట్లో కీలక ప్రకటన?
Nirmala Sitharaman | కేంద్ర ప్రభుత్వం రైతులకు బారీ ఊరట కలిగించనుందా? పీఎం కిసాన్ డబ్బులను పెంచబోతోందా? అన్నదాతలకు ఇకపై రూ. 8 వేలు లభించనున్నాయా?
PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించబోతోందా? పీఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతోందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీ సర్కార్ పీఎం కిసాన్ రైతులకు చెల్లించే డబ్బులను పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
భారత ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఈ బడ్జెట్ను తీసుకురాబోతోంది. ఈ బడ్జెట్లో కేంద్రం రైతులకు తీపికబురు అందించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
పీఎం కిసాన్ స్కీమ్ కింద చెల్లించే డబ్బులను పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు అందిస్తోంది. మూడు విడతల్లో ఏడాదిలో మూడు సార్లు ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతున్నాయి.
అయితే ఈసారి బడ్జెట్లో ఈ రూ. 6 వేల మొత్తాన్ని రూ. 8 వేలకు పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు కీలక ప్రకటన చేయొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే రైతులకు రూ.2 వేలు అదనంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఈ రూ. 8 వేల డబ్బులను నాలుగు విడతల్లో రైతులకు అందించొచ్చని తెలుస్తోంది. అంటే మూడు ఇన్స్టాల్మెంట్లు కాస్తా నాలుగు అవుతాయి. అప్పుడు నాలుగు దఫాలుగా రూ.2 వేలు చొప్పున మొత్తంగా ఏడాదికి రూ. 8 వేలు లభించనున్నాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్ కింద అందించే డబ్బులను పెంచే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు కేంద్రం వచ్చే బడ్జెట్లో పీఎం కిసాన్ రైతులకు ఊరట కలిగిస్తుందా? లేదా? అనే అంశం కచ్చితంగా ఎవ్వరికీ తెలీదు.
అయితే పెంచే ఛాన్స్ ఉందంటూ నివేదికలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే రైతులకు మాత్రం చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలానే పీఎం కిసాన్ డబ్బులను పెంచొచ్చనే నివేదికలు చాలానే వెలువడ్డాయి. అయితే కేంద్రం మాత్రం పీఎం కిసాన్ డబ్బులను పెంచలేదు.
ఇప్పుడు మరోసారి ఈ పీఎం కిసాన్ పెంపు అంచనాలు తెర పైకి వచ్చాయి. మరి ఈసారి అయినా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను పెంచుతుందేమో చూడాలి. కాగా కేంద్రం ఇప్పటి వరకు 12 విడతల డబ్బులను రైతులకు అందించింది. ఈ నెలలోనే మరో విడత డబ్బులు కూడా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి చేరాల్సి ఉంది. కాగా కేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. లేదంటే లేదు. అందువల్ల మీరు కూడా కేవైసీ పూర్తి చేసుకోండి.