Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

PM Kisan Scheme Updates

PM Kishan శుభవార్త.. రైతుల అకౌంట్లలోకి మళ్లీ డబ్బులు..

 

 

రైతులకు అదిరే గుడ్ న్యూస్. మళ్లీ అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడు జమ కానున్నాయో తెలుసుకోండి.

 

 

 

 

అన్నదాతలకు మరో గుడ్ న్యూస్. అదిరిపోయే ఊరట. ఏంటని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మరోసారి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చి చేరనున్నాయి. ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు రానున్నాయి? ఎంత వస్తాయి? వంటి అంశాలు మనం ఒకసారి తెలుసుకుందాం.

అన్నదాతలకు మరో గుడ్ న్యూస్. అదిరిపోయే ఊరట. ఏంటని అనుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మరోసారి బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వచ్చి చేరనున్నాయి. ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేయనుంది. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు రానున్నాయి? ఎంత వస్తాయి? వంటి అంశాలు మనం ఒకసారి తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ఏటా అకౌంట్లలోకి మూడు సార్లు డబ్బులు జమ కానున్నాయి.

పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు వస్తున్నాయి. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో జమ అవుతున్నాయి. అంటే రూ.2 వేల చొప్పున నాలుగు నెలలకు ఒకసారి ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయి. ఇప్పటి వరకు 16 విడతల డబ్బులు వచ్చాయి. అంటే రూ. 32 వేలు రైతులకు అందాయి.

ఇప్పుడు 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. చివరిగా పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు ఫిబ్రవరి 28న రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి. దాదాపు 9 కోట్ల మంది రైతులకు రూ. 21 వేల కోట్లు పడ్డాయి. అర్హత కలిగిన అందరికీ డబ్బులు లభించాయి.

ఇప్పుడు తర్వాతి విడత కింద డబ్బులు అందాల్సి ఉంది. ఈ డబ్బులు ఎప్పుడు రావొచ్చొ ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా అయితే ఏప్రిల్ జూలై, ఆగస్ట్ నవంబర్, డిసెంబర్ మార్చి కాలానికి సంబంధించి విడతల వారీగా డబ్బులు వస్తాయి.

ఫిబ్రవరి నెల చివరిలో 16వ విడత డబ్బులు లభించాయి. అంటే తర్వాతి విడత డబ్బులు మే నెలలో ఎప్పుడైనా రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడొచ్చని తెలుస్తోంది. అంటే ఏప్రిల్ నుంచి జూలై కాలంలో ఎప్పుడైనా డబ్బులు రావొచ్చు. అయితే కచ్చితమైన తేదీ మాత్రం తెలీదు. ప్రభుత్వం త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేయొచ్చు.

కాగా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే రైతులు కచ్చితంగా ఇకేవైసీ చేసుకోవాల్సిందే. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇకేవైసీ తప్పనిసరి చేసింది. అందువల్ల మీరు ఇంకా ఈ పని పూర్తి చేయకపోతే వెంటనే కంప్లీట్ చేసుకోండి.

ఆధార్ ఓటీపీ ద్వారా మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ పని పూర్తి చేసుకోవచ్చు. లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. తర్వాతి విడత డబ్బులు పొందాలని భావించే వారు ఈ పని పూర్తి చేసుకోండి.

Related Articles

Back to top button