Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Police Jobs Recruitment 2022

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4300 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్..

 

 

 

 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్‌ విభాగం సబ్ ఇన్‌స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మరియు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF)లో సబ్ ఇన్‌స్పెక్టర్ GD ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నోటీసు ప్రకారం.. ఆగస్టు 10 నుండి SI పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.

 

 

SSC సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in సందర్శించడం ద్వారా చేయాలి. ఢిల్లీ పోలీస్ మరియు CAPF సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 30.

 

 

మొత్తం పోస్టుల సంఖ్య 4300 ఉండగా.. సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు పురుషులకు 228, స్త్రీలకు 112 కేటాయించారు 3960 పోస్టులు సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సు సబ్ ఇన్‌స్పెక్టర్(జీడీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

 

అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. SI GD CAPF-స్థాయి-6కు నెలకు రూ. 35,400 నుంచి 1,12,400 మధ్య ఉంటుంది. SI ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్-లెవల్-6కు నెలకు రూ. 35,400-1,12,400 ఉంటుంది.

 

 

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ లో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ , సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

 

తెలంగాణలో వీటికి సంబంధించి పరీక్ష కేంద్రాలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, విశాఖ పట్నం రాజమండ్రి, చీరాల, విజయనగరంలో పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కొరకు ఈ https://ssc.nic.in/ వెబ్ సైట్ సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button