Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel

Postal Government Jobs 2023 ||  indiapostgdsonline.gov.in || పోస్టల్ నుంచి ఎన్టీపీసీ వరకు.. 13,543 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

INDIAN పోస్టల్ నుంచి ఎన్టీపీసీ వరకు.. 13,543 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం..

 

 

Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. వివిధ రకాల నోటిఫికేషన్లు కేంద్రం నుంచే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేస్తున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. వివిధ రకాల నోటిఫికేషన్లు కేంద్రం నుంచే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విడుదల చేస్తున్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. మరొకొన్నింటికి కొనసాగుతున్నాయి. ఇలా దరఖాస్తు చేసుకోవాల్సిన 5 నోటిఫికేషన్లో దాదాపు 13,543 ఖాళీలు ఉన్నాయి. వీటికి త్వరలో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఆ ఉద్యోగాల గరించి పూర్తిగా తెలుసుకుందాం.

 

ఇండియా పోస్ట్ GDS..

 

గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం ఇండియా పోస్ట్ 12 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. వీటికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మీకు కూడా అర్హత మరియు ఆసక్తి ఉంటే.. ఇండియా పోస్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను indiapostgdsonline.gov.in సందర్శించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 12828 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 11 జూన్ 2023.

 

 

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ లేదా ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లోని ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు bdl-india.in వెబ్ సైట్ సందర్శించి తమ దరఖాస్తులు చేసుకోవచ్చు. 23 జూన్ 2023 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేస్తారు.

DFCCIL ఉద్యోగాలు ..

డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. మీరు DFCCIL యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి dfccil.com వెళ్లాలి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 535 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తులు మే 20 నుండి ప్రారంభమయ్యాయి. వాటిపై దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 జూన్ 2023.

NTPCలో..

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తులు మే 18 నుండి ప్రారంభం కాగా.. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూన్ 01, 2023. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేస్తారు. ఒక సంవత్సరం శిక్షణా కాలం పూర్తయిన తర్వాత.. అభ్యర్థి నెలకు రూ. 30,000 నుండి రూ. 1,20,000 వరకు జీతం పొందుతారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం.. అభ్యర్థులు ఈ రెండు వెబ్‌సైట్‌లలో దేనినైనా సందర్శించవచ్చు careers.ntpc.co.in లేదా ntpc.co.in.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button