Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Rajiv Yuva Vikasam Scheme 2025 Eligible List Released..

How to Check Your Name in the List? | Rajiv Yuva Vikasam Scheme

 

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ప్రస్తుతం రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగుల ఆశాజ్యోతి గా మారింది. 2025లో ఈ పథకం దశలవారీగా అమలవుతూ, అర్హులైన వారికి ఐదు విడతల్లో నిధులు మంజూరు చేయనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం భావించినా, సాంకేతిక కారణాల వల్ల కొద్దిగా ఆలస్యం అయ్యింది.

రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితా – ముఖ్య సమాచారం

 

అంశంవివరాలు
దరఖాస్తుల సంఖ్య16,23,643
అంగీకరించిన దరఖాస్తులు15,53,551 (95.68%)
బ్యాంకుల పరిశీలనకు పంపించినవి13,83,950 (85.24%)
బ్యాంకులు ఆమోదించినవి8,93,219 (55.01%)
నగదు చెల్లింపు విధానం5 విడతలుగా ఫేసుల వారీగా
అధికారిక వెబ్‌సైట్tgobmmsnew.cgg.gov.in

 

 

ఈ పథకానికి అర్హతలు ఏమిటి?

రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితాలో చేరేందుకు నిర్దిష్ట అర్హతలు ఉండాలి:

  • వయస్సు: 21 నుంచి 60 సంవత్సరాల మధ్య
  • కుటుంబ వార్షిక ఆదాయం: రూ.2.5 లక్షలకు మించకూడదు
  • విద్యార్హత: కనీసం పదోతరగతి పాస్ అయి ఉండాలి
  • అభ్యర్థి నిరుద్యోగి అయి ఉండాలి

ఈ అర్హతలు పూర్తిగా కలిసిన అభ్యర్థులనే జాబితాలో చేర్చనున్నారు.

మొత్తం ఎంత మొత్తం చెల్లిస్తారు?

ప్రతి అర్హుడికి మొత్తం ఐదు విడతల్లో నగదు మంజూరు చేయబడుతుంది. మొదటి విడత చెల్లింపులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. బ్యాంకుల సహకారంతో నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.

 

 

 

 

 

Related Articles

Back to top button