Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

RRB Exam Schedule 2024-25

రైల్వేలో 41,500 కొలువులు.. రాత పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

 

 

ఇటీవల రైల్వేశాఖ భారీగా ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా 41,500 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నింటినీ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. అన్ని రైల్వే జోన్లలో 18799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్సై పోస్టులు, 14298 టెక్నీషియన్‌ పోస్టులు, 7951 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి.

 

 

 

ఇటీవల రైల్వేశాఖ భారీగా ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా 41,500 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నింటినీ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. అన్ని రైల్వే జోన్లలో 18799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు, 452 ఆర్‌పీఎఫ్‌ ఎస్సై పోస్టులు, 14298 టెక్నీషియన్‌ పోస్టులు, 7951 జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటికీ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్‌పీఎఫ్‌ ఎస్సై, జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. టెక్నీషియన్‌ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

 

 

 

తాజాగా ఆయా ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచింది. పరీక్షల షెడ్యూల్‌ చూస్తే.. పరీక్షలన్నీ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లోనే జరగనున్నట్లు తెలుస్తుంది. పరీక్షకు పది రోజుల ముందు ఎగ్జామ్‌ సిటీ, తేదీ వివరాలు వెల్లడిస్తారు. ఇక నాలుగు రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది. అక్రమాలను అరికట్టేందుకు పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ఆధార్‌ లింక్‌డ్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి చేసింది. కాబట్టి అభ్యర్థులందరూ తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది.

 

 

ఆర్‌ఆర్‌బీ రాత పరీక్ష తేదీల పూర్తి షెడ్యూల్‌ ఇదే..

 

 

  • అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1) రాత పరీక్షలు నవంబర్‌ 25, 2024 నుంచి 29 వరకు
  • ఆర్‌పీఎఫ్‌ ఎస్సై రాత పరీక్షలు డిసెంబర్‌ 02, 2024 నుంచి 05వ తేదీ వరకు
  • టెక్నీషియన్ పోస్టులకు రాత పరీక్షలు డిసెంబర్‌ 16, 2024 నుంచి 26వ తేదీ వరకు
  • జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రాత పరీక్షలు డిసెంబర్‌ 06, 2024 నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి

కాగా ఎన్‌టీపీసీ, పారామెడికల్‌, ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలు ప్రకటించాల్సి ఉంది.

 

 

 

 

Related Articles

Back to top button