Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

RRB || www.indianrailways.gov.in

RRB ఐటీఐ అర్హ‌త‌తో.. రైల్వేలో 9970 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

 

 

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత ఐటీఐ( ITI ), డిప్లొమా( Diploma ) చేసిన విద్యార్థుల‌కు ఇదో సువ‌ర్ణ అవ‌కాశం. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియ‌న్ల‌లో( Railway Regions ) అసిస్టెంట్ లోకో పైల‌ట్(Assistant Loco Pilot )) పోస్టుల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు( RRB ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 9970 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అత్య‌ధికంగా సికింద్రాబాద్ రీజియ‌న్‌( Secunderabad Region ) లో 1500 ఖాళీలు, రాంచీ రీజియ‌న్‌( Ranchi Region )లో 1213 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైల‌ట్( ALP ) ఉద్యోగం పొందిన వారికి లెవ‌ల్ -2 ప్ర‌కారం ప్రారంభ వేత‌నం రూ. 19,900 ఇవ్వ‌నున్నారు.

 

అర్హ‌త‌లు..

ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మెకానిక‌ల్ /ఎల‌క్ట్రిక‌ల్ లేదా ఎల‌క్ట్రానిక్స్/ ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ నాలుగు బ్రాంచీల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 

 

వ‌య‌స్సు..

2025 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేండ్లు, ఓబీసీల‌కు మూడేండ్లు వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపు ఉంటుంది.

 

 

ఎంపిక విధానం ఇలా..

– 21 ఆర్ఆర్‌బీల్లో ఏదో ఒక ఆర్ఆర్‌బీకి మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
– మొద‌టి స్టేజీ సీబీటీ 1
– రెండో స్టేజీ సీబీటీ 2
– కంప్యూట‌ర్ బేస్డ్ ఆప్టిట్యూట్ టెస్ట్
– డాక్యుమెంట్ వెరిఫికేష‌న్
– మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్

 

 

సీబీటీ 1 ఇలా..

ఇది కేవ‌లం స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్ర‌మే. సీబీటీ-2కు అభ్య‌ర్థుల‌ను దీని ద్వారా ఎంపిక చేస్తారు.
సీబీటీ 1 స్కోర్‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.
సీబీటీ 1లో మొత్తం 75 ప్ర‌శ్నలు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక్క మార్కు కేటాయించ‌నున్నారు.
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్ర‌తి త‌ప్పు జ‌వాబుకు 1/3 మార్కు కోత విధిస్తారు.
ప‌రీక్ష కాల వ్య‌వ‌ధి 60 నిమిషాలు.

 

 

సీబీటీ 2 ఇలా..

సీబీటీ 1లో వ‌చ్చిన స్కోర్‌ను నార్మ‌లైజేష‌న్ చేసి క‌మ్యూనిటీ వైజ్‌గా సీబీటీ2కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.
ఖాళీల సంఖ్య‌ను బ‌ట్టి 1:15 నిష్ప‌త్తిలో ఎంపిక చేస్తారు.
సీబీటీ 2లో రెండు పార్టులు ఉంటాయి. ఒక‌టి పార్ట్ ఎ, రెండోది పార్ట్ బీ.
ప‌రీక్ష కాల వ్య‌వ‌ధి రెండున్న‌ర గంట‌లు(150 నిమిషాలు).
మొత్తం ప్ర‌శ్న‌లు 175. పార్ట్ ఎలో 100 ప్ర‌శ్న‌ల‌కు 90 నిమిషాలు కేటాయించారు. పార్ట్ బీలో 75 ప్ర‌శ్న‌ల‌కు 60 నిమిషాలు కేటాయించారు.
పార్ట్ బీ కేవ‌లం క్వాలిఫైయింగ్ నేచ‌ర్ ప‌రీక్ష మాత్ర‌మే.
ఇక సంబంధిత ట్రేడుల నుంచి ప్ర‌శ్న‌లు ఇస్తారు. పార్ట్ ఎలో మ్యాథ్స్, జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి ప్ర‌శ్న‌లు ఇస్తారు.

 

 

ముఖ్య‌మైన తేదీలు

ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివ‌రి తేదీ : మే 11
ద‌ర‌ఖాస్తులో స‌వ‌ర‌ణ‌ల‌కు : మే 14 నుంచి 23 మ‌ధ్య అవ‌కాశం
వెబ్‌సైట్ : www.indianrailways.gov.in

 

OFFICIAL WEB SITE LINK

 

 

 

 

 

Related Articles

Back to top button