Runa Mafi Updates 2023 || Rythu Bandhu 2023
90 వేల లోపు రైతు రుణాల మాఫీ
90 వేల లోపు రైతు రుణాల మాఫీ
రైతులకిచ్చిన మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసిం ది. ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
- 37 వేల నుంచి 90 వేల లోపు రుణాలకు వర్తింపు
- బడ్జెట్లో 6,385 కోట్లు కేటాయింపు
- నిరుటి కంటే 2,385 కోట్లు అధికం
- రైతులకిచ్చిన మరో హామీని నేరవేర్చనున్న ప్రభుత్వం
రైతులకిచ్చిన మరో ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసిం ది. ఈ ఏడాది రూ.90 వేల లోపు గల రైతుల పంట రుణాలను మాఫీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.6,385 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గత బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం రూ.4,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి రూ.2,385 కోట్లు అధికంగా కేటాయించింది. ఈ నిధులతో రూ.37 వేల నుంచి రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయనున్నది. తద్వారా మెజార్టీ రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. తొలిసారి 2014 ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసింది. అప్పట్లో 35.31 లక్షల మందికి రూ.16,144 కోట్ల రుణాలను మాఫీ చేసింది. 2018 ఎన్నికల్లోనూ పంట రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రూ.37 వేల లోపు రుణాలను మాఫీచేసింది. మొత్తం 5.42 లక్షల మందికి చెందిన రూ.1,207 కోట్ల రుణాలను మాఫీ చేసింది. మిగిలిన 37 వేల నుంచి 90 వేల లోపు గల రుణాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేయనున్నది.
హామీ ఇచ్చారంటే.. చేసినట్టే
రైతులకు మేలు జరుగుతుందనుకుంటే ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. అలాంటి వ్యక్తి రైతులకు హామీ ఇస్తే అది నెరవేరడం ఖాయం. అలాంటిదే రైతు రుణమాఫీ. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో రైతుల రుణాలను మాఫీ చేస్తున్నారు. తొలి ప్రభుత్వంలో రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసి రైతులను రుణ విముక్తి చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతా ఆ ఒరవడిని కొనసాగిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితులు, కేంద్రం సహకరించకపోవడం, నిధుల్లో కోత పెడుతుండటం వంటి కారణాలతో రెండోసారి రుణమాఫీకి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదురుకోవడంతో సీఎం కేసీఆర్.. తాను ఇచ్చిన మాట ప్రకారం మరోసారి రైతులకు రుణమాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు.
- 2014లో తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీ రూ.16,144 కోట్లు
- లబ్ధిపొందిన రైతుల సంఖ్య 35.31 లక్షలు
- 2018 నుంచి ఇప్పటివరకు చేసిన రుణమాఫీ రూ.1,207 కోట్లు
- లబ్ధిపొందిన రైతుల సంఖ్య 5.42 లక్షలు
- రుణమాఫీకి తాజా కేటాయింపులు రూ.6,385.20 కోట్లు
- గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు రూ.4,000 కోట్లు గతం కన్నా రూ.2,385.20 కోట్లు అధికం
రాష్ర బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం రూ.6385 కోట్లు
Farmers Loan waiver Budget 2023- 24: తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం 2023-24 ఆర్థిక ఏడాదికిగానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.6385 కోట్లు ప్రతిపాదించింది. ఈమేరకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వ్యవసాయానికి జవజీవాలనందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రైతుల కళ్లలో దీనత్వం తొలిగి.. ధీరత్వం తొణికిసలాడుతోందని ఆయన పేర్కొన్నారు.