Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Rythu Bandhu Scheme

ఇకపై వారికి మాత్రమే రైతుబంధు డబ్బులు.. కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్..

 

 

రైతుబంధు పథకాన్ని సాగు భూమికే వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలైన లబ్ధిదారులకే ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపట్టనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.

 

 

రైతుబంధు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని అసలైన లబ్ధిలాదారులకే అందేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో భూమి ఉన్న వారందరికీ రైతుబంధు సాయం అందుతోంది. రెండు సీజన్లలో కలిపి ఎకరానికి రూ. 10 వేల పంట పెట్టుబడి సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ కారణంగా వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు సాయం అందుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాములు, పడావు భూములు, కొండలు, గట్టులు, బీడు భూములు ఉన్నవారు కూడా ఎకరానికి రూ. 10 వేల సాయం పొందుతున్నారు. దీంతో రైతులతో పాటు అర్హత లేని వారికి కూడా డబ్బులు అందుతున్నాయి. మరో వైపు కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా సాయం అందడం లేదు.
ఈ నేపథ్యంలో రైతు బంధు పథకాన్ని పక్కగా అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. సాగు భూములకే పంట పెట్టుబడి సాయం అందేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం గ్రామ స్థాయిలో సాగు భూమి ఎన్ని ఎకరాలు ఉందో తేల్చేందుకు సర్వేలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నిర్వహించి మొత్తం సాగు భూమి ఎంత ఉంది, బీడు భూమి ఎంత ఉంది అనే వివరాలు సేకరించనుంది. దీని ద్వారా అసలైన లబ్దిదారులకు రైతు బంధు సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేస్తే ప్రభుత్వంపై వేల కోట్ల భారం తగ్గుతుంది.
గత వానాకాలం సీజన్ లో తెలంగాణవ్యాప్తంగా 68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. మొత్తం కోటి 52 లక్షల 43 వేల 486 ఎకరాలకు రూ. 7,624 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో వ్యవసాయం చేయని వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొండలు, గుట్టలు, చెరువులు, బీడు భూములు గల వారు కూడా ఉన్నవారు. సంపన్నులు, ఆదాయపు పన్ను కట్టేవారు కూడా ఉన్నారు. ఫలితంగా అనర్హులు కూడా లబ్ధిపొందారు.
అసలైన సాగు భూమికి మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తే ప్రభుత్వానికి రూ. 3,750 కోట్లు ఆదా కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాగు భూమి లెక్కలు పక్కాగా తేల్చేందుకు సర్వే చేపట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించుకుని అసలైన లబ్ధిదారులకే ప్రయోజనం చేకూర్చాలని చూస్తోంది.
తెలంగాణలో 1.52 కోట్ల ఎకరాల పట్టభూములు ఉన్నాయి. వీరిలో ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులే 90 శాతం మంది ఉన్నారు. అయితే ఐదు ఎకరా కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మందే ఉన్నప్పటికీ, వారి వద్ద 52 లక్షల ఎకరాల భూమి ఉంది. వీరికే రైతు బంధు ద్వారా సంవత్సరానికి వేల కోట్లు అందుతున్నాయి. ఐదు ఎకరాల లోపు ఉన్నవారికే రైతు బంధు పథకాన్ని వర్తింపచేస్తే ప్రభుత్వానికి ఏటా రూ. 7,800 కోట్ల వరకు ఆదా అవుతుందని సమాచారం.
అలాగే రాష్ట్రంలో 25.5 లక్షల ఎకరాలు పడావు భూములే ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి రైతుబంధు నిలిపేస్తే రూ. 3,750 కోట్లు ఆదా అవుతుంది. మొత్తంగా కొత్త నిబంధనలు తీసుకొస్తే ప్రభుత్వంపై రూ. 11,500 కోట్లకుపైగా భారం తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతుబంధు పథకం నిబంధనలు సడలించాలని ప్రభుత్వం బావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా, రైతుబంధు పథకాన్ని రైతు భరోసా మార్చనున్నట్లు కాంగ్రెస్ ఎన్నికల సమయంలోనే ప్రకటించింది. ఎకరానికి ప్రస్తుతం అందుతున్న సాయం రూ. 10 వేలను రూ. 15 వేలకు పెంచనున్నట్లు తెలిపింది. మార్గదర్శకాలు ఖరారు చేసిన తర్వాత వచ్చే విడత నుంచి సాయాన్ని పెంచే అవకాశముంది.

Related Articles

Back to top button