దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇప్పటికే రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం నిబంధనలను వర్తింపజేస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చిందని రాజకీయ, వ్యవసాయరంగ వర్గాలు భావిస్తున్నాయి.
దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇప్పటికే రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం నిబంధనలను వర్తింపజేస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చిందని రాజకీయ, వ్యవసాయరంగ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాకు పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే అర్హులైన రైతుల సంఖ్యలో భారీగా కోత పడే ప్రమాదం ఉన్నది. గతంలో బీఆర్‌ఎస్ సర్కారు ప్రతి సీజన్‌లో సుమారు 70 లక్షల మందికి రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద 30 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతున్నది.