Rythu Runa Mafi Status 2023 Telangana Rythu Runa Mafi
Rythu Runa Mafi Status 2023 Check Telangana
కర్షకులకు రూ.లక్ష వరకు రుణమాఫీ
జిల్లాలో 60,601 మందికి ప్రయోజనం
అన్నదాతలకు రూ.306.28 కోట్ల లబ్ధి
45 రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియ
ఆదేశాలు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం
2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి అప్పు తీసుకున్న వారే అర్హులు
రైతుల నిరీక్షణకు తెరపడనుంది.. ఎట్టకేలకు రాష్ట్రప్రభుత్వం కర్షకులకు శుభవార్త చెప్పింది. 2018 రాష్ట్ర శాసనసభ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ బుధవారం కీలక ప్రకటన చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి రూ. లక్షలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయా లని సంకల్పించింది. 2023 సెప్టెంబర్ 15వ తేదీ నాటికి పూర్తిగా మాఫీ చేయాలని ఆదేశాలు రావడంతో జి ల్లాలోని బ్యాం కర్లు కసరత్తు ప్రారంభించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 60, 601 మంది రైతుల రుణమాఫీ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. ఇప్పటికే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఉన్న రైతుల రుణామాఫీ చేసిన ప్రభుత్వం.. ఇ ప్పుడు రూ.లక్షలోపు రుణాలను మా ఫీ చేస్తోండటంతో కర్షకులల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
2018 ఎన్నికల్లో హామీ..
రాష్ట్రంలోని 2018 శాసనసభ ఎన్నికల హామీల్లో భాగం గా సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.లక్షలోపు ఉన్న రైతుల రుణమాఫీ హామీ 2023 ఎన్నికల ముందు పూర్తిస్థాయిలో అమలు కాబోతుంది. 2018 డిసెంబర్ నాటికి రూ.లక్షలోపు రుణాలు ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. రైతు రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 60, 601 మంది రైతులు లబ్ధిపొందనున్నారు. జిల్లాలోని రూ.లక్షలోపు రుణాలు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వంకు రూ. 306.28 కోట్లు అవసరం కానున్నాయి. ఈ మేరకు రైతు ల రుణాల వివరాలపై జిల్లాలోని బ్యాంకర్లు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే డిసెంబర్ 2018 వరకు రూ.లక్షలోపు రుణం ఉన్నవారి వివరాలను ప్రభుత్వంకు బ్యాంకర్లు అందించారు.
రైతుల తిప్పలు..
2018 డిసెంబర్ 11 తేదీ నాటికి బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణాలు ఉన్న మాఫీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. 2020 మార్చి 18న కుటుంబంలో ఒకరికి మాత్రమే రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం జీవోలో పేర్కోనడంతో జిల్లా వ్యాప్తంగా 60,601 మంది రైతులను అధికారులను అర్హులుగా గుర్తించారు. పంట రుణాల మాఫీలో భాగంగా జిల్లాలో మొదటివిడతలో రూ.25 వేల రుణాలు మాఫీ చేసిన తరువాత రైతులకు ఎదురు చూపులే మిగిలాయి. తరువాత రెండోవిడత లో ప్రభుత్వం రూ.50 వేల లోపు రుణాలు మాఫీ చేసిన జిల్లాలోని చాలామంది రైతుల రుణాలు మాఫీ అయిన దాఖాలాలు లేవు. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా రూ. 25 వేల లోపు రుణాలు ఉన్న రైతుల రుణాలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.5.19 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు రుణమాఫీని ప్రకటించిన నాటి నుంచి రైతులు బ్యాంకుల చుట్టు తిరుగుతూనే ఉన్నారు. బ్యాంకర్లు మాత్రం పాత రుణాలను చెల్లించుకోవాలని చెబుతూనే
కొత్తగా లోన్లు ఇవ్వకపోవడంతో రైతులకు వడ్డీ వ్యా పారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో చాలా మం ది రైతులకు లోన్ల కోసం బ్యాంకుల మొఖం చూడటమే మానేశారాని చెప్పొచ్చు. ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన ప్రభు త్వం మళ్లీ ఎన్నికల సమయంలో పంట రుణాల మాఫీ ప్రస్తావన తేవడంతో ఎన్నికల స్టంటే అని రైతులు చర్చించుకుంటున్నారు.
డిఫాల్టర్లుగా అన్నదాతలు..
రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతుల రుణాలు మా ఫీ చేస్తామన్న ప్రభుత్వం ప్రకటన అలసత్వం చేయడం తో చాలామంది బ్యాంకర్లు వారిని డిఫాల్టర్లుగా గుర్తించారు. కరోనా, ఇతరత్ర కారణాలతో గత నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేయలేదు. ఇదే అదనుగా బ్యాంకర్లు జిల్లాలోని వేలాదిమంది రైతులను డిఫాల్టర్లుగా గుర్తించారు. లోన్లు చెల్లించాలని రైతుల మీద బ్యాంకర్లు విపరీతంగా ఒత్తిడి తెచ్చారు. రైతులకు నోటిసులు పంపించి, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. రైతుబంధు సొమ్మును కుడా బ్యాంకర్లు పాతబాకీ కింద జమచేసుకున్న సందర్భరాలు కోకోల్లలు. దీనికి తోడు వరిపంట అమ్మిన సొమ్ము రైతుబాకీ ఉన్న అకౌంట్లో పడటంతో బ్యాంకర్లు బాకీ కింద తీసుకోవడంతో రైతులు పడ్డ తిప్పలు అన్నిఇన్ని కాదు. దీనికి తోడు 2018 డిసెంబర్ నాటికి రూ.లక్షలోపు రుణాలు మాఫీచేస్తాం అన్న ప్రకటన 2023 సెప్టెంబర్ నాటికి పూర్తిగా అమలు అవుతుండటంతో రైతుల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందానే ఆశ తో చాలామంది రైతులు రూ.లక్షకు వడ్డీ చెల్లించకపోవడంతో ఆ వడ్డే ఐదేండ్లల్లో రూ. 50 వేలకుపైగా అయ్యిం ది. అసలు లక్షకు వడ్డీ రూ.50 వేలు మించి ఉండటంతో ఏంచేయాలో అర్థంకానీ పరిస్థితిలో రైతులు ఉన్నారు.