Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

SBI Recruitment 2022

ఎస్‌బీఐలో 5,008 ఉద్యోగాలు... జస్ట్ డిగ్రీ పాసైతే చాలు

 

 

 

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. దేశవ్యాప్తంగా 5008 జూనియర్ అసోసియేట్ (Junior Associate) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది.

 

 

 

నిరుద్యోగులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో భారీ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 5,008 ఖాళీలను భర్తీ చేస్తోంది. 5008 రెగ్యులర్ ఖాళీలతో పాటు 478 బ్యాక్‌లాగ్ పోస్టుల్ని కూడా భర్తీ చేస్తోంది. ఒక అభ్యర్థి ఒక రాష్ట్రంలోని ఖాళీలకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 సెప్టెంబర్ 27 చివరి తేదీ. డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది ఎస్‌బీఐ. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, సర్కిళ్ల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకోండి.

 

 

SBI Recruitment 2022: సర్కిళ్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే

 

 మొత్తం ఖాళీలు 5008
 తెలంగాణ 225
 గుజరాత్ 353
 డామన్ డయ్యూ 4
 కర్నాటక 316
 మధ్యప్రదేశ్ 39
 చత్తీస్‌గఢ్ 92
 పశ్చిమ బెంగాల్ 340
 అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ 10
 సిక్కిం 26
 ఒడిషా 170
 జమ్మూ కాశ్మీర్ 35
 హర్యానా 5
 హిమాచల్ ప్రదేశ్ 55
 పంజాబ్ 130
 తమిళనాడు 355
 పాండిచ్చెరి 7
 ఢిల్లీ 32
 ఉత్తరాఖండ్ 120
 రాజస్తాన్ 284
 కేరళ 270
 లక్షద్వీప్ 3
 ఉత్తర ప్రదేశ్ 631
 మహారాష్ట్ర 747
 గోవా 50
 అస్సాం 258
 అరుణాచల్ ప్రదేశ్ 15
 మణిపూర్ 28
 మేఘాలయ 23
 మిజోరామ్ 10
 నాగాల్యాండ్ 15
 త్రిపుర 10

 

 

SBI Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 2022 సెప్టెంబర్ 7

 

 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాసైతే చాలు. ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ డిగ్రీ చదువుతున్నవారు 2022 నవంబర్ 30 లోగా పాస్ కావాలి.
వయస్సు- 2022 ఆగస్ట్ 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, టెస్ట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
మీడియం ఆఫ్ ఎగ్జామ్- ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ
వేతనం- రూ.17,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.47,920.

 

 

SBI Recruitment 2022 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button