Telangana Govt Jobs 2022 Updates
తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. లెక్చరర్, మోడల్ స్కూల్ టీచర్ల ఖాళీలు ఎన్నంటే?
తెలంగాణలో త్వరలోనే భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అధ్యాపక, మోడల్ స్కూల్ టీచర్ జాబ్స్ కు సంబంధించిన ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో 80 వేలకు (Telangana Government Jobs) పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ఖాళీల లెక్కలతో కూడిన ప్రతిపాదనలను ఆయా శాఖలు ప్రభుత్వానికి అందిస్తున్నాయి. తాజాగా ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఖాళీలపై (Jobs) ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలను పంపించారు. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తం 1,392 ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3500 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిని క్రమబద్ధీకరిస్తామని సర్కార్ ఇటీవల తెలిపింది. దీంతో మిగిలిన 1,392 ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ ఖాళీల్లో మల్టీ జోన్-1లో 724, మల్టీ జోన్ 2 లో 668 ఖాళీలు ఉన్నాయి. ఇంకా 91 ఫిజికల్ డైరెక్టర్ ఖాళీలు, 40 లైబ్రేరియన్, 343 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనునన్నారు. ఇంకా రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ లో మొత్తం 1024 ఖాళీలు ఉండగా.. వాటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 707 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 27 ప్రిన్సిపాళ్లు, 275 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ), 405 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ (టీజీటీ) ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారికి మరో శుభవార్త. అవసరమైతే మరో 10,000 టీచర్ పోస్టుల్ని (Teacher Jobs) భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. సాధారణంగా ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయని, ప్రభుత్వ రంగంలో జాబ్స్ (Govt Jobs) తక్కువని అన్నారు.
గవర్నమెంట్ జాబ్‌తో ఉద్యోగ భద్రత ఉంటుంది కాబట్టి యువత ఈ ఉద్యోగాల కోసం ఎక్కువగా పోటీ పడుతుంటారని, కానీ అందరికీ ఉద్యోగాలు రావడం సాధ్యం కాదన్నారు. ఇప్పటివరకు ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయబోతున్నట్టు తెలిపారు. తొమ్మిది, పదో షెడ్యూల్ సంస్థల్లో కూడా మరో 5000 నుంచి10000 ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతీ ఏటా ఏర్పడే ఖాళాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.