Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Telangana Govt Sanction Another 529 Posts In Telangana Panchayatraj Department 2022

TS Govt Jobs 2022 || పంచాయతీ రాజ్ శాఖలో మరో 529 ఉద్యోగాలు

 

 

 

 

 

 

 

Panchayat Raj Department Jobs: తెలంగాణలో ఉద్యోగ ప్రకటనలు వరసగా వచ్చేస్తున్నాయి. మరోవైపు భారీగా పోస్టుల భర్తీకి కూడా సర్కార్ నుంచి అనుమతులు వస్తున్నాయి. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో 529 పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

 

 

 

Telangana Panchayat Raj Department Jobs 2022: తెలంగాణలో ఉద్యోగ ప్రకటనలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా… మరికొన్నింటిని ఇచ్చేందుకు కూడా కసరత్తు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే మిగతా శాఖలు కూడా అదే పనిలో పడ్డాయి. తాజాగా పంచాయతీరాజ్ శాఖలోనూ 500కు పైగా ఉద్యోగాల భర్తీకి అనుమతి లభించింది. ఫలితంగా త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

 

 

 

కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో పంచాయతీ రాజ్ శాఖలో ఈ పోస్టులను మంజూరు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు పేర్కొన్నారు. మొత్తం ఖాళీలు 529 ఉండగా… వీటిలో జూనియర్ అసిస్టెంట్ 253, సీనియర్ అసిస్టెంట్ – 173, సూపరింటెండెంట్ – 103 ఉద్యోగాలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను అత్యంత త్వరగా పూర్తి చేయాలను అధికారులను ఆదేశించారు.

 

 

 

TSPSC Job Recruitment 2022: ఇదిలా ఉండగా.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల అవుతున్నాయి. తాజాగా మున్సిపల్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో దరఖాస్తు సమర్పించాలి.

 

 

 

రాష్ట్రంలోని పల్లె, బస్తీ దవాఖానాలకు కూడా 1569 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీటిని ఒప్పంద ప్రతిపాదకన భర్తీ చేస్తారు.మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పేరిట ఈ పోస్టులు నింపనున్నారు. ఇందులో బస్తీ దవాఖానాల్లో 349, పల్లె దవాఖానాల్లో 1,220 కలిపి 1569 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు ఇలా ఉంటాయి…

ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేయడానికి ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ అర్హత కలిగిన వైద్యులను తీసుకుంటారు. ఎంబీబీఎస్‌ అర్హత కలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది. అయితే వీరు ఆసక్తి కనబర్చకుంటే,… 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులను తీసుకుంటారు.

 

 

2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు.

 

పల్లె బస్తీ దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీలుగా పనిచేసే ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ వైద్యులకు నెలకు రూ.40 వేల వేతనం ఇస్తారు.

 

ఈ పోస్టులోనే పనిచేసే స్టాఫ్‌నర్సులకు నెలకు రూ.29,900 చొప్పున గౌరవ వేతనం ఉంటుంది.

 

అర్హత వయసు- 18-44 ఏళ్లు(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు అయిదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది)

జిల్లా నియామక కమిటీ నేతృత్వంలో భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆయా జిల్లాల్లో సెప్టెంబర్ 7వ తేదీన నియామక ప్రకటన వెలువడింది.

 

 

దరఖాస్తు దాఖలుకు ఈ నెల 17 తుది గడువుగా ప్రకటించారు.

 

అర్హుల జాబితా – సెప్టెంబర్ 29, 2022

అభ్యంతరాల స్వీకరణ – సెప్టెంబర్ 30, 2022

తుది జాబితా – అక్టోబర్ 3, 2022

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button