Andhra PradeshNational & InternationalTelanganaTop News

Telangana State road transport corporation 2019 updates || Telangana RTC strike update news

 

 

 

దీర్ఘకాలం సమ్మెచేయడం

ద్వారా ఆర్టీసీని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతున్నదని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది. కొందరు రాజకీయ నాయకులు కార్మికులను తప్పుదోవ పట్టించి సమ్మెకు ప్రేరేపించారని, యూనియన్ల నాయకులు తమ స్వప్రయోజనాలకోసం ఆర్టీసీ సమ్మెను సాధనంగా వాడుకొంటున్నారని ఆక్షేపించింది. ఆర్టీసీ సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ జరుగనున్న నేపథ్యంలో సంస్థ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ శనివారం అదనపు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె.. కార్పొరేషన్‌ను మరింత ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తున్నదని పేర్కొన్నారు.

 

సమ్మెద్వారా కార్మికులు

తమంతట తామే సమస్యలను సృష్టించుకుంటున్నారని అన్నారు. ఒకవేళ కార్మికులు సమ్మెను వదిలేసి స్వచ్ఛందంగా విధుల్లోకి చేరడానికి ముందుకు వచ్చినా.. వారిని కొనసాగించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోలేని కష్టమైన పరిస్థితిని వారే కల్పించారని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని, ఇది రోజురోజుకూ పెరిగిపోతున్నదని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాలని పేర్కొంటూ పలు చట్టబద్ధ సంస్థల నుంచి డిమాండ్లు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వాటిని చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వేలకోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోతున్నాయని వెల్లడించారు. ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ తన అఫిడవిట్‌లో పొందుపరిచిన అంశాలు..

 

ఆర్టీసీలో తరచూ సమ్మెలు..

గత గణాంకాలను పరిశీలిస్తే.. ఆర్టీసీ కార్మికులు తరచూ సమ్మెకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. ఇతర కార్పొరేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీలో ఈ సంప్రదాయం ఎక్కువగా కొనసాగుతున్నది. తమ సమ్మె వల్ల జనజీవనం తీవ్రంగా ప్రభావితం అవుతుందని తెలిసి కూడా సమ్మెకు దిగుతున్నారు. కార్మికులు చేస్తున్న చట్టవిరుద్ధమైన సమ్మెను ఉపేక్షించి, వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటే ఇతర ఉద్యోగులు, కార్పొరేషన్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇతర కార్పొరేషన్లు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉన్నది. తద్వారా అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది.

 

కార్మికులను తప్పుదోవ పట్టించారు

ఆర్టీసీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే కొంతమంది రాజకీయ నాయకులే ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి కారణం. వారు కార్మికులను తప్పుదోవ పట్టించి చట్టవిరుద్ధమైన సమ్మెకు ప్రోత్సహించారు. దీనివల్ల కార్మికులు, యాజమాన్యం, ప్రజలు.. తమ తప్పులేకపోయినా మూల్యం చెల్లించాల్సి వస్తున్నది. చిన్నచిన్న విషయాలకు కూడా సమ్మెకు వెళ్లడం రివాజుగా మారింది. అసంబద్ధమైన డిమాండ్లను ముందుపెడుతూ సమ్మెను ప్రకటించారు.

 

సరైన ఫోరాన్ని ఆశ్రయించవచ్చు

పారిశ్రామిక సమస్యలు.. పారిశ్రామిక వివాదాల చట్టం (ఐడీ యాక్ట్)లో ఉన్న వ్యవస్థలు, సంప్రదింపులు, కన్సిలియేషన్ వంటి ప్రక్రియల ద్వారా పరిష్కారం అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. చట్టంలోని చాప్టర్ 5.. సమ్మెలు, లాకౌట్‌ల సందర్భాల్లో పరిష్కారాలను చూపుతున్నది. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో సరైన ఫోరాన్ని ఆశ్రయించవచ్చు.

 

సమ్మెను సాధనంగా మార్చుకుంటున్న సంఘాల నేతలు

సమ్మె అనేది కార్మికుల సంక్షేమానికి వాడాల్సిన ఒక ఆయుధం. కానీ కొందరు కార్మికసంఘాల నాయకులు తమ సంక్షేమం, పరపతిని పెంచుకునే దురుద్దేశంతో సమ్మెను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది దురుద్దేశంతోచేసే సమ్మెలను ప్రోత్సహించరాదు. ఇలాంటి సమ్మె ద్వారా ఎలాంటి డిమాండ్లు పరిష్కారం కావు. కార్మికసంఘాల నాయకులు, ప్రత్యర్థి రాజకీయపార్టీల నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలుచేస్తూ ప్రభుత్వాన్ని లక్ష్యంచేసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులను రెచ్చగొడుతున్నారు. కఠినచర్యలు చేపట్టకపోతే పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉన్నది.

 

విలీనం డిమాండ్ ఎప్పుడైనా రావొచ్చు..

కార్మిక నాయకులు ఇప్పటికీ విలీనం గురించి మాట్లాడటం ఆందోళనకు గురిచేస్తున్నది. విలీనం డిమాండ్‌ను ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కనపెట్టి మిగతా డిమాండ్లపై చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇది వారి వైఖరిని తేటతెల్లం చేస్తున్నది. భవిష్యత్తులో ఎప్పుడైనా విలీనం డిమాండ్ తెరపైకి రావొచ్చు. విలీనం డిమాండ్‌ను ముందుపెట్టి మరోసారి రాష్ర్టాన్ని అస్థిరపర్చే ప్రయత్నం జరుగొచ్చు. కొంతమంది యూనియన్ నాయకుల మొండి, అహంకారపూరిత వైఖరి వల్ల మొత్తం కార్మికులు కష్టాలు పడాల్సివస్తున్నది. ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని అస్థిరపర్చే ఉద్దేశంతో యూనియన్ నాయకులు కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది.

 

ఇది సంస్థ ఉనికికే ప్రమాదంగా మారింది.

దీర్ఘకాలంలో స్టేక్‌హోల్డర్లందరిపై ప్రభావం చూపుతుంది. ఆర్టీసీ సంస్థకు మాత్రం ఎలాంటి ద్వేషభావం లేదు. ఐడీ యాక్ట్ సెక్షన్ 22, 23 ప్రకారం పబ్లిక్ యుటిలిటీ సర్వీసు (పీయూఎస్) ల్లో సమ్మెలను నిషేధించారు. రోడ్డు రవాణా కూడా యుటిలిటీ సర్వీస్ కిందికి వస్తుందని చట్టంలో ఉన్నది. నోటీసు ఇచ్చి కనీసం 6 వారాలు కాకముందే సమ్మెకు వెళ్లడం చట్టవిరుద్ధం. ఐడీ యాక్ట్ – 1947 ద్వారా సంక్రమించిన అధికారాలతో 23 ఆగస్టు 2019 నుంచి రాష్ట్రంలో మోటర్ ట్రాన్స్‌పోర్ట్ పరిశ్రమను పబ్లిక్ యుటిలిటీ సర్వీస్‌గా గుర్తిస్తూ జీవో 408ని జారీచేసింది. ఇది ఆరునెలలపాటు కొనసాగుతుంది.

 

50 కార్పొరేషన్లు విలీనం అంటే..?

ఆర్టీసీ ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నప్పటికీ 67 శాతం వేతనాలను పెంచాం. అమలుచేయడం వీలుకాదని తెలిసి కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనే వింత వాదనతో కార్మికసంఘాల నాయకులు ముందుకువచ్చారు. రాష్ట్రంలో 50 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక కార్పొరేషన్‌ను విలీనం చేస్తే.. అందరూ వరుసకడుతారు. ఇది సాధ్యంకాదని తెలిసి కూడా కార్మికసంఘాల నాయకులు సమ్మెకు వెళ్లారు. దసరా పండుగను ఎంచుకొని సమ్మెకు వెళ్లారు. సమ్మె నోటీసులు ఇవ్వడమే నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. పండుగ సందర్భంగా లాభాలు వస్తాయని యాజమాన్యం ఆశించింది. లాభాలు రావాల్సిన సమయంలో చట్టవిరుద్ధమైన సమ్మెవల్ల ఆర్టీసీపై తీవ్ర ఆర్థికభారం పడింది. అయినప్పటికీ అధిక నష్టాలను భరిస్తూ ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

సమ్మె అనేది

 

కార్మికుల సంక్షేమానికి వాడాల్సిన ఒక ఆయుధం. కానీ కొందరు కార్మికసంఘాల నాయకులు తమ సంక్షేమం, పరపతిని పెంచుకునే దురుద్దేశంతో సమ్మెను సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది దురుద్దేశంతోచేసే సమ్మెలను ప్రోత్సహించరాదు. ఇలాంటి సమ్మె ద్వారా ఎలాంటి డిమాండ్లు పరిష్కారం కావు. కార్మికసంఘాల నాయకులు, ప్రత్యర్థి రాజకీయపార్టీల నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులను రెచ్చగొడుతున్నారు.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button