Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Telangana Teacher Jobs 2022

టెట్ ఫలితాల వెల్లడితో.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు..!

 

 

 

దాదాపు ఐదేళ్ల తర్వాత టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 12న టెట్ పేపర్ 1, పేపర్ 2లకు పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ అధికారులు జూన్ 29న తుది కీ విడుదల చేసి నేడు టెట్ ఫలితాలను వెల్లడించారు.

 

దాదాపు ఐదేళ్ల తర్వాత టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 12న టెట్ పేపర్ 1, పేపర్ 2లకు పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ అధికారులు జూన్ 29న తుది కీ విడుదల చేసి నేడు టెట్ ఫలితాలను వెల్లడించారు.

 

ఇక ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. టీచర్ పోస్టులకు టెట్ తప్పనిసరి అన్న సంగతి తెలిసిదే. టెట్ లో అర్హత సాధించిన వారందరూ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణలోని జిల్లాల నుంచి ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించింది ప్రభుత్వం.

 

అందుకు అనుగుణంగానే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఐదేళ్లుగా టీచర్ రిక్రూట్ మెంట్ జరగలేదు. దీంతో లక్షలాది మంది ఉపాధ్యాయ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.

 

మార్చి 8వ తేదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలకు పైగా నోటిఫికేషన్లు వెలువడనున్నయని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పోలీసు, గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను కూడా స్వీకరించారు.

 

అవే కాకుండా మరి కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతితో.. నోటిఫికేషన్ల కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే గురుకులలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి పొందింది.

విద్యాశాఖలో 12,005 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఉన్నత విద్యా శాఖలో 1,678 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖలో గుర్తించిన ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
స్కూల్‌ అసిస్టెంట్స్‌ 1,950 పోస్టులు, సెకండ్‌ గ్రేడ్‌ టీచర్స్‌ 5,415 పోస్టులు, లాంగ్వేజీ పండిట్స్‌ 1,011 పోస్టులు, పీఈటీ 416 పోస్టులు, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌ 88 పోస్టులు, పీజీటీ 477 పోస్టులు, టీజీటీ 985 పోస్టులు ఖాళాగా ఉన్నాయి.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button