Telangana Teaching Jobs 2022
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీచింగ్ జాబ్స్ కు నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఖాళీలు ఎన్నంటే?
టీచర్/లెక్చరర్ ఉద్యోగాల (Teacher Jobs) కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాసంస్థలు శుభవార్త చెప్పాయి. ఆయా విద్యాసంస్థలు తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Jobs Notification) విడుదల చేశాయి.
టీచర్/లెక్చరర్ ఉద్యోగాల (Teacher Jobs) కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, ఏకలవ్య రెసిడెన్షియల్ విద్యాసంస్థలు శుభవార్త చెప్పాయి. ఆయా విద్యాసంస్థలు తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Telangana Government Jobs) విడుదల చేశాయి. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్ పాటు ఐఐటీ- జేఈఈ (మెయిన్/ అడ్వాన్స్డ్), నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 149 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 31న రాత పరీక్ష ఉంటుంది. అనంతరం వచ్చే నెల 8న (ఆగస్టు 8) డెమో/ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో మెరిట్ సాధించిన వారికి ఆగస్టు 10 లోగా పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25000 వేల ఫిక్స్డ్ వేతనం ఉంటుంది. పూర్తి వివరాలను https://www.tswreis.ac.in/ వెబ్సైట్ చూడొచ్చు.
సబ్జెక్టు | ఖాళీలు |
మాథ్స్ | 26 |
ఫిజిక్స్ | 29 |
కెమిస్ట్రీ | 32 |
బోటనీ | 30 |
జువాలజీ | 32 |
మొత్తం ఖాళీలు: | 149 |