Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TG Govt

ఏడాది సెలవుల ప్రకటన.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి

 

 

2025 సంవత్సరానికి గాను సాధారణ, ఆప్షనల్ హాలిడేస్‌ను సర్కార్ ఖరారు చేసింది.

2025 సంవత్సరానికి గాను సాధారణ, ఆప్షనల్ హాలిడేస్‌ను సర్కార్ ఖరారు చేసింది. ఈ ఏడాదిలో మొత్తంగా 27 సాధారణ, 23 ఆప్షనల్ హాలిడేస్ కలిపి మొత్తం 50 సెలవులు ఉన్నాయి. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

సాధారణ, ఆప్షనల్ సెలవులు ఇలా..

నూతన సంవత్సరం 1-జనవరి, భోగి 13-జనవరి, సంక్రాంతి/పొంగల్‌ 14-జనవరి, గణతంత్ర దినోత్సవం 26-జనవరి, మహా శివరాత్రి 26-ఫిబ్రవరి, హోలీ 14-మార్చి, ఉగాది 30-మార్చి, రంజాన్‌ 31-మార్చి, రంజాన్‌ (మరునాడు) 1-ఏప్రిల్‌, జగ్జీవన్‌ రాం జయంతి 5-ఏప్రిల్‌, శ్రీరామ నవమి 6-ఏప్రిల్‌, అంబేడ్కర్‌ జయంతి 14-ఏప్రిల్‌, గుడ్‌ ఫ్రైడే 18-ఏప్రిల్‌, బక్రీద్‌ 7-జూన్‌, మొహర్రం 6-జూలై, బోనాలు 21-జూలై, స్వాతంత్ర దినోత్సవం 15-ఆగస్టు, కృష్ణాష్టమి 16-ఆగస్టు, వినాయకచవితి 27-ఆగస్టు, మిలాద్‌-ఉన్‌-నబీ 5-సెప్టెంబరు, బతుకమ్మ 21-సెప్టెంబరు, మహాత్మాగాంధీ, జయంతి/విజయదశమి 2-అక్టోబరు, జయదశమి మర్నాడు 3-అక్టోబరు, దీపావళి 20-అక్టోబరు, కార్తీక పౌర్ణమి 5-నవంబరు, క్రిస్మస్‌ 25-డిసెంబరు, బాక్సింగ్‌ డే 26-డిసెంబర్.

Related Articles

Back to top button