Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
TG New Ration Cards 2025
కొత్త రేషన్ కార్డులకు ఎవరు అర్హులు.. ఇవిగో మార్గదర్శకాలు!
TG New Ration Cards
సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉన్న మార్గదర్శాకాల్లో మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయ పరిమితిపై మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పుచేర్పులు చేసి.. మంత్రివర్గం ముందు ఉంచనున్నారు.
రేషన్ కార్డులో జారీకి సంబంధించి.. ఆదాయ పరిమితి పెంచాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. అతి త్వరలో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం సమావేశానికి ముందే మార్గదర్శకాలను ఖరారు చేసి సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రేషన్ కార్డులకు సంబంధించి పాత మార్గదర్శకాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు, పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షలుగా ఉంది. అయితే.. ఈ మొత్తాన్ని పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.10 నుంచి 20 వేల వరకు పెంచే అవకాశం ఉంది. ఇక భూమి విషయానికొస్తే.. 3.5 ఎకరాల్లోపు పొలం, 7.5 ఎకరాల్లోపు మెట్ట భూమి అర్హతలుగా గతంలో ఉన్నాయి.
తెలంగాణలో ఇప్పటికే 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2.82 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల డిమాండ్‌పై అంచనా వేశారు. దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం తర్వాత కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. దీంతో సంక్రాంతి ముందు గానీ.. తర్వాత గానీ.. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత తుది విధివిధానాలు ఖరారు కానున్నాయి.