TGPSC Hostel Welfare Jobs 2024
581 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూల్ ఇదే..
వివిధ సంక్షేమ శాఖల్లో 581 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్ విజయేందిర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గిరిజన సంక్షేమ శాఖలో వసతి గృహ సంక్షేమ అధికారి గ్రేడ్– 1, గిరిజన సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖలో వసతి గృహ సంక్షేమ అధికారి గ్రేడ్– 2, దివ్యాంగులు,వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు కార్యాలయంలో వార్డెన్ గ్రేడ్– 1, 2, మ్యాట్రన్ గ్రేడ్– 1, 2, మహిళా, శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్ హోంలో మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 581 ఖాళీల భర్తీ చేస్తారన్నారు.
అభ్యర్థులకు ఈ నెల 24 నుంచి 29 వరకు ఉదయం 10– 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30– 5 గంటల వరకు సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ధ్రువీకరణ కోసం ఉదయం 8.30 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారని, ఉదయం 9.30 గంటలకు గేటు మూసివేస్తారన్నారు.