TGPSC Updates 2024
TGPSC కీలక నిర్ణయం..వచ్చే నెలలో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్!
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (VAS) పోస్టుల భర్తీకి దాదాపు 20 నెలల క్రితం నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఈ ప్రక్రియను పూర్తి చేసింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ఖాళీల ప్రకారం 185 పశువైద్యుల పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది.
దీని ప్రకారం గత ఏడాది జులై 13, 14 తేదీల్లో అభ్యర్థులను పరీక్షలు నిర్వహించారు. తాజాగా వాటి ఫలితాలను కూడా ప్రకటించారు. మొత్తం 185 పోస్టుల్లో 171 పోస్టులకు మాత్రమే అభ్యర్థులు ఎంపికయ్యారు.
మరో 14 పోస్టులకు అర్హులు లేకపోవడంతో ప్రజెంట్ వాటి భర్తీ ప్రక్రియను చేపట్టడం లేదు. దీంతో సెప్టెంబరు 15వ తేదీ నాటికి 171 మంది వీఏఎస్‌లను నియమించనున్నారు. పశుసంవర్ధక శాఖలో గడచిన రెండేళ్లలో పదవీ విరమణలు, పదోన్నతులు, ఇతర కారణాల వల్ల మరో 121 వీఏఎస్‌ల పోస్టుల ఖాళీ అయినట్లు కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాటి భర్తీకి మళ్లీ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశువైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (VAS) పోస్టుల భర్తీకి దాదాపు 20 నెలల క్రితం నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుడున్న ఖాళీల ప్రకారం 185 పశువైద్యుల పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం గత ఏడాది జులై 13, 14 తేదీల్లో అభ్యర్థులను పరీక్షలు నిర్వహించారు.
తాజాగా వాటి ఫలితాలను కూడా ప్రకటించారు. మొత్తం 185 పోస్టుల్లో 171 పోస్టులకు మాత్రమే అభ్యర్థులు ఎంపికయ్యారు. మరో 14 పోస్టులకు అర్హులు లేకపోవడంతో ప్రజెంట్ వాటి భర్తీ ప్రక్రియను చేపట్టడం లేదు. దీంతో సెప్టెంబరు 15వ తేదీ నాటికి 171 మంది వీఏఎస్‌లను నియమించనున్నారు. పశుసంవర్ధక శాఖలో గడచిన రెండేళ్లలో పదవీ విరమణలు, పదోన్నతులు, ఇతర కారణాల వల్ల మరో 121 వీఏఎస్‌ల పోస్టుల ఖాళీ అయినట్లు కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాటి భర్తీకి మళ్లీ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.