Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS 2,090 Gurukula appointment papers

2,090 మందికి గురుకుల నియామక పత్రాలు

 

 

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకుల్లాలో పలు పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లోని లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి….

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకుల్లాలో పలు పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లోని లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు ఉన్నాయి. ఈమేరకు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ట్రిబ్‌) ఆధ్వర్యంలో దాదాపు 2,090 మందికి నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల14 లేదా 15న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నట్టు సమాచారం. మిగతా పోస్టులనూ త్వరలోనే భర్తీ చేసేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గురుకుల బోర్డు పరిధిలో మొత్తం 9,210 పోస్టులకు గతేడాది పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

 

 

 

వరుస తప్పింది.. అర్ధరాత్రి ఫలితాల అప్‌లోడ్‌!

ట్రిబ్‌ ఆధ్వర్యంలో ఇటీవల వెల్లడించిన మెరిట్‌ జాబితా.. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూల్లో వరుస తప్పిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సమయంలో, ఆ తర్వాత అవరోహణ క్రమంలోనే భర్తీలు ఉంటాయని ట్రిబ్‌ చెబుతూ వచ్చింది. అమలులో అందుకు విరుద్ధంగా ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. అవరోహణ విధానం ప్రకారం ముందుగా డిగ్రీ లెక్చరర్‌(డీఎల్‌), తర్వాత జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) పోస్టుల ఫలితాలు విడుదల చేసి భర్తీ చేయాలి. అలాకాకుండా ముందు డిగ్రీ, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లోని లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, పీజీటీ పోస్టులను భర్తీ చేస్తోంది.

 

 

 

కొందరు అభ్యర్థులు ఒకటికన్నా ఎక్కువ పోస్టులకు అర్హతలనుబట్టి దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి డీఎల్‌, జేఎల్‌ పోస్టులకు అప్పటికే కిందిస్థాయి పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు కూడా అర్హులుగా ఉంటారు. దీంతో కిందిస్థాయి పోస్టుల నుంచి వారు పైస్థాయి పోస్టులకు వెళతారు. అప్పుడు కిందిస్థాయి పోస్టులు ఖాళీ అయితే వాటికి మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేసి భర్తీ చేయాల్సి ఉంటుంది. దీనిపై ట్రిబ్‌ పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డిగ్రీ లెక్చరర్‌, జూనియర్‌ లెక్చరర్‌, డ్రాయింగ్‌, ఆర్ట్‌ టీచర్‌, క్రాఫ్ట్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌, క్రాఫ్ట్స్‌ టీచర్స్‌, మ్యూజిక్‌ టీచర్స్‌, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ ఉద్యోగాలకు మెరిట్‌ జాబితాలు రావాల్సి ఉంది. మరోవైపు పరీక్షల అనంతరం ఆయా పోస్టులకు ఎంపికైన వారి మెరిట్‌ జాబితా, ఇంటర్వ్యూ తదితర వివరాలను కొన్ని గంటల ముందు అర్ధరాత్రి సమయంలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో విడుదల చేయబోయే ఇతర పోస్టుల వివరాలనైనా ముందుగా తెలపాలని, వెబ్‌సైట్‌లో ముందుగా అప్‌లోడ్‌ చేయాలని కోరుతున్నారు.

 

 

 

Related Articles

Back to top button