TS DSC Notification 2023, TRT Recruitment, Vacancy, Eligibility, Application Form
TS DSC Notification 2023, TRT Recruitment, Vacancy, Eligibility, Application Form
టీచర్ల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో డీఎస్సీ షెడ్యూలు ఎప్పుడు వెలువడుతుంది.. నోటిఫికేషన్ ఎప్పుడు.. పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు… జిల్లాల వారీగా ఏయే పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులతో పాటు సెప్టెంబర్ 15న జరగబోయే టెట్ రాసేందుకు ప్రిపేరవుతున్న వారందరిలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీచర్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు రాష్ట్రంలో 6 లక్షల మందికి పైగా ఉన్నట్లు విద్యాశాఖ అంచనా. వీరందరూ ప్రస్తుతం నిర్వహించబోయే డీఎస్సీలో పోటీ పడే అవకాశాలున్నాయి. ఎన్నికలు ముంచుకు రావటంతో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించేందుకు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. దీంతో ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థుల కోరిక నెరవేరటంతో పాటు వచ్చే ఎన్నికల్లో తమకు లభి చేకూరుతుందని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ వేసేందుకు సన్నద్ధమైంది.
రెండు రోజుల్లో టీచర్ల భర్తీకి సంబంధించిన విధివిధానాలను రెడీ చేయాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో టీచర్ల భర్తీ విధివిధానాలు, ఖాళీల వివరాలను వచ్చే రెండు, మూడు రోజుల్లోనూ విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్ 15న పెట్ పరీక్ష జరుగనుంది. 27వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడవుతాయి. టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు టీచర్ పోస్టులకు అర్హులవుతారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్, పరీక్షల తేదీలన్నీ ఇప్పుడు జరుగుతున్న టెట్ ను దృష్టిలో పెట్టుకొని ఖరారు చేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అందుకే టీచర్ల భర్తీ విధివిధానాలు ఇప్పుడు సిద్ధం చేసినప్పటికీ.. సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఒకటీ రెండు రోజుల నుంచే డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28 లేదా 29వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్లు స్వీకరించే అవకాశాలున్నాయి. అక్కణ్నుంచి అభ్యర్థులకు కనీసం 60 రోజుల ప్రిపరేషన్ టైమ్ ఉండేలా పరీక్ష తేదీని ఖరారు చేస్తారు. దీంతో డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ టెంటేటివ్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఈలోగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలు వెలువడితే.. దానికి అనుగుణంగా డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలుంటాయని అధికారులు తెలిపారు.
ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలున్నాయి.. ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది విద్యాశాఖ ఇటీవలే కసరత్తు చేసింది. ఇటీవల సేకరించిన సమాచారం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 5089 ఖాళీలున్నాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 1739, సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 2575, లాంగ్వేజ్ పండిట్లు 611, ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET) 164 పోస్టులున్నాయి. వీటితో పాటు 1523 స్పెషల్ టీచర్ల ఖాళీలున్నాయి. 796 ప్రయిమరీ స్కూల్స్, 727 అప్పర్ ప్రయిమరీ స్కూల్స్ లో స్పెషల్ టీచర్ల ఖాళీలున్నాయి. వీటన్నింటి భర్తీకి ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
మొత్తం ఖాళీలు 6612
రెగ్యులర్ టీచర్లు 5089
స్పెషల్ టీచర్లు 1523
రెగ్యులర్ టీచర్ల 5089
స్కూల్ అసిస్టెంట్లు 1739
సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 2575
లాంగ్వేజీ పండిట్లు 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET) 164