Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS Govt Job Notifications || TSPSC మరో 1,433 ఉద్యోగ నియామకాలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

 

 

మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్‌ హెల్త్‌లో236, చీఫ్‌ ఇంజనీర్‌ రూరల్‌ వాటర్‌ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ పంచాయతీ రాజ్‌ జనరల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

 

 

కాగా ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకా మిగిలిన ఆయా శాఖాల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 ఉద్యోగాల భ‌ర్తీ చేస్తామని శాసన సభ వేదికగా  సీఎం కేసీఆర్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్టు,  ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

 

మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 12,775  ఉద్యోగాలను విడతలవారీగా భర్తీ చేయాలని, అందులో 10,028 ఉద్యోగాలను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే.  ఇందులో తొలి విడతగా 1326 ఎంబీబీఎస్ అర్హత కలిగిన ఉద్యోగాలకు నోటిఫికేష్ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే  గ్రూప్ వన్, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం తెలిసిందే. తాజాగా మంగళవారం మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లోని మరో 1433 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button