TS Govt Jobs
తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ శాఖలో 1,326 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ప్రభుత్వానికి చెందిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది.
తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త. ప్రభుత్వానికి చెందిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు (TS Jobs) దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 14ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
S.No | పోస్టు | ఖాళీలు |
1. | సివిల్ అసిస్టెంట్ సర్జన్ (డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ లో..) | 731 |
2. | ట్యూటర్ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో..) | 357 |
3. | సివిల్ అసిస్టెంట్ సర్జన్-జనరల్ / జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో..) | 211 |
4. | సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ లో..) | 7 |
మొత్తం: | 1,326 |
విద్యార్హతల వివరాలు:
ఎంబీబీఎస్ తో పాటు అందుకు సమానవైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.200 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే..: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు.