Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS Police Jobs 2022 || Telangana police constable exam updates 2022

ఈ నెల 28న తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.. ఓ లుక్కేయండి

 

 

 

కానిస్టేబుల్  కావాల‌నే కోరిక ఉంటే స‌రిపోదు. అందుకు త‌గిన‌ట్టుగా ప్రిపేర్ కావాల్సిన ఆవ‌స‌రం ఏంతైనా ఉంది. 2016, 2018 నోటిఫికేషన్లతో పోల్చితే ఈ సారి కానిస్టేబుల్ క్వ‌శ్చన్ పేప‌ర్ ప్యాట్రన్ ను మార్చారు.

 

 

కానిస్టేబుల్ కావాల‌నే కోరిక ఉంటే స‌రిపోదు. అందుకు త‌గిన‌ట్టుగా ప్రిపేర్ కావాల్సిన ఆవ‌స‌రం ఏంతైనా ఉంది. 2016, 2018 నోటిఫికేషన్లతో పోల్చితే ఈ సారి కానిస్టేబుల్ (Constable Jobs) క్వ‌శ్చన్ పేప‌ర్ ప్యాట్రన్ ను మార్చారు. ముందు డైరెక్టుగా క్వశ్చన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బ్యాంకింగ్ సెక్ట‌ర్, స్టాఫ్ సెలెక్ష‌న్ సెక్ట‌ర్, సివిల్ బేస్ క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేస్తున్నార‌ని నిపుణులు అంటున్నారు. 22 సంవ‌త్స‌రాల అనుభ‌వంతో త‌న స‌ల‌హాలు సూచ‌న‌లు చేశారు ఆయన.  కానిస్టేబుల్ (Police Jobs) కు ఇంటర్  క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంటర్ సెకండియర్ చదివే వారు కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది. చిన్న వయస్సులో ఉద్యోగం సంపాదించుకుంటే ఆ కుటుంబం సెట్ అవుతుంది. ఇది మంచి సర్వీస్ ప్లాట్ఫామ్ కూడా. క‌రోనా స‌మ‌యంలో ప్రైవేట్ ఉద్యోగాలతో (Private Jobs) ఇబ్బందులు పడిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆగస్టు 28న నిర్వహించనున్నారు.

 

 

కానిస్టేబుల్ కావాల్సిన వారు తప్పని సరిగా ప్రిలిమ్స్ క్వాలిపై కావాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు క్వాలిఫై కాకపోతే కానిస్టేబుల్ అవ్వాలన్న మీ కల గల్లైంతైనట్లే. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. అందులో 60 మార్కులు తెచ్చుకుంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినట్లే లెక్క.  60 మార్కులు సాధించడం ఎలా అనేది మనకు తెలుసుకుందాం. మీరు ప్రీవియస్ గా చదువుకున్న టెన్త్, ఇంటర్ వరకూ ఉన్న సిలబస్ మాత్రమే ఈ పరీక్షలో ఉంటుంది. కొత్తగా ఏమీ ఉండదు.

 

 

తక్కువ టైం లో ఎక్కువ స్కోర్ చేయడానికి ఏ విష‌యాల‌పై దృష్టి పెట్టాలంటే..  తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగింది? తెలంగాణ హిస్టరీ అంటే ఏంటి?  ఇండియన్ హిస్టరీ అంటే ఏంటి? అనేది ఈ మూడు టాపిక్స్ చదువుకుతుంటే మీకు యాభై మార్కులు వస్తాయి. మనకి ఇంకా  రీజనింగ్.. అంటే మ్యాథ్స్ చాలా ఈజీ గా ఉంటుంది. క్వాలిఫై కావాలి అనుకునే వారు ఏదన్న డౌట్ ఉన్న వారు మీరు మొదటగా తెలంగాణ హిస్టరీ, ఇండియా హిస్ట‌రీ, బ్లడ్ రిలేషన్స్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్  మీద ఫోకస్ అనేది ఎక్కువ చేస్తారు. కోడింగ్-డీకోడింగ్ మీద కూడా 25 క్యశ్చన్స్ అడుగుతున్నారు.  2016, 2018 లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఇవే టాపిక్స్ పై ఎక్కువగా అడిగారు.

 

 

 

అర్ధమెటిక్స్ లో కొన్ని టాపిక్స్ మాత్రమే తీసుకోండి..  నంబర్ సిస్టమ్స్ పర్సెంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్..  టైం అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ మేజర్ గా తీసుకున్నట్లయితే వీటిపై పోకస్ చేస్తే ఈ ఇరవై ఐదు రోజుల్లో మీరు క్వాలిఫై కావచ్చు.  ఇంకోటి ఏంటంటే మెన్సురేషన్ క్షేత్రమితి ఎవరైతే పర్ఫెక్ట్ చేస్తే.. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు.. మెయిన్స్ ఎగ్జామ్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది.

 

 

మీరు చదివింది ఇక్కడితో అయిపోదు.ఈ చదివిందంతా కూడా మీకు మెయిన్స్ లో కూడా ఉపయోగపడుతుంది. మెయిన్స్ లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఇప్పుడు ప్రిపేర్ అయితే అప్పటికి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ చాలా ముఖ్యం. వీటిని బాగా చదువుకుంటే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. క‌చ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొడుతారు.

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button